టెక్నాలజీ ఎంతలా పెరిగిపోతోందో చూస్తూనే ఉన్నాం.గతంలో ఏదైనా జరిగితే కనీసం ఊర్లో వాళ్లకు కూడా తెలిసేదికాదు.
కానీ ఇప్పటి టెక్నాలజీ పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా సరే ఇట్టే వైరల్ అయిపోతోంది.ఇక విస్థృతంగా సోషల్ మీడియాలను వాడేయడం అలాగే స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉండటంతో ఎవరైనా ఈజీగా తెలుసుకుంటున్నారు.
ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైరల్ వీడియోనే నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.దీన్ని చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
మొత్తం వీడియో చూస్తేనే అందులో ఏం జరిగిందో తెలుస్తుంది.
ఇక హైదరాబాద్ లో సదర్ పండుగలు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో అందరికీ తెలిసిందే.
దీపావళి తర్వాత యాదవ సామాజిక వర్గం అత్యంత గ్రాండ్ గా జరిపే ఈ పండుగకు దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.ఇకపోతే ఇప్పుడు కూడా అంటే మొన్న దీపావళి తర్వాత సదర్ ఉత్సవాన్ని నిర్వహించటంతో చాలామంది ఈ వేడుకలకు వచ్చారు.
అయితే ఇందులో దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఆడిస్తారన్న విషయం తెలిసిందే.మొన్నడీజే ఓ చోట ఇలాగే సదర్ పండుగ నిర్వహించగా ఇందులో టపాకులు భారీ ఎత్తున పేల్చారు.
దీంతో దున్నపోతు ఒక్కసారిగా ఆ హడావుడికి బెదిరిపోయి రోడ్ మీద పరుగులు తీసింది.ఇక ఆ దున్నపోతును కంట్రోల్ చేయలేకపోవడంతో బీభత్సం సృష్టించింది.
ఇందులో కొందరికి గాయాలు కూడా అయ్యాయి.అయితే ఆ దున్నపోతును కంట్రోల్ చేసేందుకు ఉన్న తాడు ఒక టూ బైక్ లో ఇరుక్కుపోయింది.
అయినా సరే ఆ దున్నపోతు మాత్రం దాన్ని లెక్క చేయకుండా బైక్ తో సహా లాక్కెళ్తూ పరుగులు తీసింది.ఇక దీన్నంతా కూడా వెనకాల వెళ్తున్న వారు వీడియో తీసుకుంటూ వచ్చారు.
ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
.