ఫోన్లకే కాదు.. కార్ల కోసం కూడా పవర్ బ్యాంక్స్..!

మీరు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఉపయొగీస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త.సాధారణంగా మన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే మన వెంట పవర్ బ్యాంకును తీసుకుని వెళతాం కదా.

 Not Just Phones Power Banks For Cars Too Phone's, Power Banks, Latest News, Upda-TeluguStop.com

అలాగే ఇకమీదట ఎలక్ట్రికల్ వెహికల్ ఉపయోగించే వారు కూడా ఇలాగే తమ వెంట బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకునే విధంగా పవర్‌ బ్యాంకును తీసుకునే వెళ్లవచ్చు.ఆ సదుపాయం కూడా రెడీ అయిపోయింది.

ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్ఘారాల వాడకం ఎక్కువ అయిపొయింది.అందుకనే కర్బన పదార్ధాల వాడకాన్ని తగ్గించే క్రమంలో ఎలక్ట్రిక్‌ కార్లను ఉపయోగించాలంటూ అ‍న్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు చెబుతున్నాయి.

అలాగే ఒక పక్క పెట్రోలు,డీజిల్‌ ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి.

అందుకనే ప్రజలు ఎక్కువగాఎలక్ట్రిక్‌ వెహికల్స్ కొనాలనే ఆలోచన చేస్తున్నారు.

కాగా ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలని భావించే వారు ముందుగా ఆలోచించే విషయం ఏదన్నా ఉంది అంటే.అది ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉంటాయా అని, అలాగే వెహికల్‌ మైలేజీ రేంజ్‌ ఎంతవరకు వస్తుందనే అంశాలను అందరు ఆలోచిస్తున్నారు.

Telugu Cars, Latest, Banks, Ups Latest, Zip Charge-Latest News - Telugu

ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్లే‍ప్పుడు మొబైల్‌ ఫోన్ల మాదిరి నిరంతరం ఛార్జింగ్‌ ఉండేలా కార్లకు కూడా ఛార్జింగ్ ఉండేలా పవర్ బ్యాంకును అందుబాటులోకి తీసుకుని వచ్చారు.బ్రిటన్‌కి చెందిన జిప్‌ఛార్జ్‌ అనే స్టార్టప్‌ కంపెనీగోపేరుతో ఈ పవర్‌ బ్యాంకును తయారు చేసింది.గ్లాస్కోలో జరుగుతున్న కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ పార్టీస్‌ 26 సదస్సులో ఈ పవర్‌ బ్యాంకుని ఆవిష్కరించింది.అయితే ఫోన్ పవర్ బ్యాంకు ఎక్కడికన్నా క్యారీ చేయాలంటే ఐజీ గా తీసుకుని వెళ్లొచ్చు.

Telugu Cars, Latest, Banks, Ups Latest, Zip Charge-Latest News - Telugu

మరి ఈవెహికల్స్ పవర్ బ్యాంకు అంటే పెద్దదిగా ఉంటుంది అని బయపడాలిసిన పనిలేదు.గరిష్టంగా 20 కేజీల బరువు ఉండేలాగా ఈ పవర్‌ బ్యాంకును డిజైన్ చేసారు.చూడడానికి చిన్న సూట్‌కేస్‌ మాదిరిగా ఉంటుంది.అలాగే దీనిని సులభంగా తీసుకుని వెళ్ళడానికి ఈ సూట్ కేసుకు వీల్స్‌ కూడా అమర్చారు.కారు డిక్కీలో ఇది ఈజీగా పడుతుంది.అయితే ఈ పవర్ బ్యాంక్ ధర ఇంకా నిర్ణయించలేదు.

ఈ పవర్ బ్యాంకును ఛార్జ్‌ చేస్తే కనిష్టంగా 35 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని జిప్‌ఛార్జ్‌ చెబుతోంది.రెండు వేరియంట్లలో జిప్‌ఛార్జ్‌ సంస్థ 20kw , 40kw వేరియంట్లలో మనకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube