అ‌ష్టాచమ్మా సినిమా ఆడిషన్స్ కి వచ్చిన నాని.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినపల్లి మండలంలో పుట్టి, వైద్య విద్య అభ్యసించడానికి ప్రవేశ పరీక్ష రాశాడు.కానీ, సీటు రాకపోవడం చేత కర్నూలు సిల్వర్ జూబ్లి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, అనంతరం హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సినిమాటోగ్రఫీ చేసి, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ ఉన్నత స్థాయికి ఎదిగి ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు పి.

 What Happened When Nani Avasarala Srinivas Came For Astachamma Auditions Details-TeluguStop.com

జె.విందా. అష్టా-చెమ్మా, వినాయకుడు లాంటి సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసిన విందా, ఆయన చేసిన గ్రహణం సినిమాకి గానూ జాతీయ అవార్డు కూడా వచ్చింది.

అష్టాచమ్మా సినిమాకు అప్పటికీ ఎవరినీ అనుకోలేదు.

అప్పుడు టాలెంట్‌ హంట్‌ కోసం వెళ్లినపుడు నటుడు నాని, శ్రీనివాస్ అవసరాల వచ్చి ఆడిషన్ ఇచ్చారని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జె.విందా తెలిపారు.వాళ్ల మీద టెస్ట్ షూట్ చేశానని ఆయన అన్నారు.

ఆ సినిమా చిన్న్ బడ్జెట్ సినిమా.అందువల్ల ప్రొడ్యూసర్ చెప్పగానే వెళ్లి షూట్ చేశామని ఆయన వివరించారు.

అప్పటికే తనకు గ్రహణం రెఫరెన్స్ ఉంది కాబట్టి వెళ్లి షూట్ చేయడం జరిగిందని విందా అన్నారు.

Telugu Astachamma, Nani, Naniavasarala, Tollywood-Movie

అక్కడ వారితో ఒక డైలాగ్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని రామానాయుడు ల్యాబ్‌లో ఒక పెద్ద గ్రీడింగ్ చేశారని ఆయన అన్నారు.అక్కడ పెద్దలందరూ చూసి ఫొటోగ్రఫీ బాగుంది ఎవరు, సీనియర్‌లా చేశారు అని వాళ్లు పొగిడినట్టు ఆయన తెలిపారు.

Telugu Astachamma, Nani, Naniavasarala, Tollywood-Movie

అంతకు ముందు గ్రహణం సినిమా చేశానని చెప్పడంతో అందుకే చాలా బాగా చేశారని వారు తమను మెచ్చుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాతే అ‌ష్టాచమ్మా చేశానని ఆయన వెల్లడించారు.అక్కడి నుంచి అలా చేస్తూ చేస్తూ ఇక్కడి వరకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube