కెనడా : రక్షణ మంత్రి అనితా ఆనంద్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు..!!

కెనడా రక్షణ మంత్రిగా ఇటీవల నియమితులైన భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు.కోవిడ్ మహమ్మారి సమయంలో మీరు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.

 Tamilnadu Chief Minister Mk Stalin Greets Anita Anand A Person Of Tamil Origin A-TeluguStop.com

తమిళనాడు మూలాలకు చెందిన మీరు కెనడా రక్షణ మంత్రిగా నియమితులైనందుకు సంతోషంగా వుందని.కొత్త పాత్రలో రాణించాలని స్టాలిన్ ఆకాంక్షించారు.

కాగా.మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిన్ ట్రూడో ‌కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌ను నియమించారు.ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన తీరుపై ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశాయి.దీంతో స్పందించిన ట్రూడో సజ్జన్‌ను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్‌కు అప్పగించారు.అనంతరం సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు.54 ఏళ్ల అనితా ఆనంద్ ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే.తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.వీరికి ఐర్లాండ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్‌లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.

ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Telugu Anita Anand, Drsaroj, Drsundar, Harjeet Sajjan, Justin Trudeau, Stalin, T

2019 అక్టోబర్‌లో అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా ఆమె సేవలందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube