TAGS రచనల పోటీ... తెలుగువారికి మాత్రమే...ప్రథమ బహుమతిగా...

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో కాలిఫోర్నియాలో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) కు ప్రత్యేకత ఉంది.తెలుగు బాషాభివ్రుద్ది కోసం ఎన్నో ఏళ్ళుగా విశిష్ట కృషి చేస్తూ తెలుగు వారందరికీ చోదోడుగా ఉంటూ , తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలు భవిష్యత్తు తరాల వారికి తెలియజేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

 Tags  రచనల పోటీ… తెలుగువారికి మ�-TeluguStop.com

ప్రతీ ఏటా తెలుగు వారికి నిర్వహించే రచనల పోటీ కోసం తాజాగా ప్రకటన కూడా జారీ చేసింది.ప్రస్తుతం TAGS ఎప్పటి లానే తన ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4 వ రచన పోటీలని చేపట్టనున్నట్లు వెల్లడించింది.

విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ కధ, కవితల పోటీలలో పాల్గోనడానికి అర్హులని తెలిపింది.భారత్ మినహా మిగిలిన ఏ దేశంలో తెలుగు వారు ఉన్నా వారందరూ ఈ పోటీలకు అర్హులుగా ప్రకటించింది.

ఈ పోటీలలో పాల్గొనడానికి ఎలాంటి నిభందనలు, షరతులు, ఉంటాయో వాటి విధి విధానాలు వెల్లడించింది.అలాగే పోటీలలో పాల్గొన్న వారికి మొదటి, ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వనున్నట్లుగా తెలిపింది.

పోటీలలో పాల్గొనే వారికి షరతులు.

– పోటీలలో పాల్గొనే వారు కేవలం భారత్ మినహా ఇతర దేశాలలో ఉండే తెలుగు వారుగా ఉండాలి.

– ఒక్కో విభాగానికి ఒక్కో రచన మాత్రమే పంపాలి అలాగే తెలుగు రాసిన రచనలు మాత్రమే పరిశీలించబడుతాయి.
– కధలు పంపే వారు పది పేజీల లోపు మాత్రమే పంపాలి, అలాగే కవితలు, పంపే వారు ఐదు పేజీల లోపు మాత్రమే పంపాలి.
– గతంలో ప్రచురించిన కవితలు, కధలు స్వీకరించబడవు, స్వీయ రచనలు మాత్రమే పంపాలి.

– ప్రధాన విభాగంలో పాల్గొనే వారు 18 ఏళ్ళు నిండిన వారిగా ఉండాలి.

ఇదిలాఉంటే పోటీలలో మొదటి బహుమతిగా 116 డాలర్లు, రెండవ బహుమతిగా 58 డాలర్లు, మూడవ బహుమతిగా 28 డాలర్లు అందజేస్తారు.మరిన్ని వివరాల కోసం సంస్థ విడుదల చేసిన గోడ పత్రికలు పరిశీలించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube