ప్రియుడి కోసం రోడ్డుపై కొట్టుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు..

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.అయితే కాలం మారుతున్న కొద్ది మ‌నుషుల మ‌ధ్య ప్రేమ కూడా కొత్త పుంత‌లు తొక్కుతోంది.

 Two Girls Hit On The Road For Boyfriend , Girls Fight, Viral Video-TeluguStop.com

ఒక‌ప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయితోనే ప్రేమ‌యాణం న‌డ‌వ‌డం మ‌నం చూశాం.కానీ ఇప్పుడు అలా కాదు పెండ్లికి ముందే ఒక అబ్బాయితో చాలామంది ప్రేమాయ‌ణాలు న‌డిపిస్తున్న ఘ‌ట‌న‌లు కూడా మ‌నం అనేకం చూస్తున్నాం.

ఇద్ద‌రిలో ఎవ‌రూ త‌క్కువ కాద‌న్న‌ట్టు అబ్బాయిల‌తో పాటు అమ్మాయిలు కూడా ఒక‌రికంటే ఎక్కువ‌మందితో ల‌వ్ ఎఫైర్ న‌డుపుతున్న ఘ‌ట‌న‌లు మ‌నం అనేకం చూస్తున్నాం.

అయితే ఈ న‌డుమ ఒక అబ్బాయి ఇద్ద‌రు లేదంటే ముగ్గురితో కూడా సంబంధాలు కొన‌సాగిస్తున్నారు.

అయితే ఇలాంట‌ప్పుడే అస‌లు విష‌యం తెలిసి కొంద‌రు ప్రియుడిని చిత‌క‌బాదుతుంటే మ‌రికొన్ని సార్లు మాత్రం ప్రియుడి కోసం అమ్మాయిలే కొట్టుకోవ‌డం చాలా విచిత్రంగా మారిపోయింది.ఇప్పుడు కూడా ఇలంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.

యూపీలోని బరాబిర్వా ప్రాంతంలో ఇద్ద‌రు అమ్మాయిలు ఇలాగే కొట్టుకున్నారు.ఓ అబ్బాయి మాజీ, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్స్ ఇద్ద‌రు ఇలా గొడ‌వ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది.

అయితే అది బార్ ద‌గ్గ‌ర అని స‌మాచారం.

ఈ బార్‌కు రాబిన్ అనే వ్య‌క్తి త ప్ర‌స్తుత గ‌ర్ల్ ఫ్రెండ్‌తో వ‌చ్చాడు.

అయితే అదే స‌మ‌యంలో కారులో మ‌రో యువ‌తి అక్క‌డ‌కు వ‌చ్చి ఆగింది.కాగా ఆ కారులో ఉన్న యువతి రాబిన్ మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్‌.ఇంకేముంది ఇలా ఇద్ద‌రు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఒక‌రికి ఒక‌రు ఎదురుప‌డ‌టంతో తీవ్రంగా కొట్టుకున్నారు.కాగా మాజీ ప్రియురాలికి తీవ్రంగా దెబ్బ‌లు తాక‌డంతో ఆమె పరిస్థితి విషమించింది.

దీంతో అక్క‌డున్న వారు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఇక ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని రాబిన్‌తో పాటు అత‌ని ప్ర‌స్తుత ప్రియురాలిని కూడా అరెస్టు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube