బెంగుళూరును వ‌ణికిస్తున్న క‌రోనా కొత్త వేరియంట్‌..

క‌రోనా. ఈ పేరు వింటేనే చాలు జ‌నాలు వ‌ణికిపోతున్నారు.

 Corona Is A New Variant That Is Trading In Bangalore, Bangalore, Corona New Vari-TeluguStop.com

ప్ర‌పంచాన్ని ఈ క‌నిపించ‌ని శ‌త్రువు ఎంత‌లా అత‌లాకుతలం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.గ‌తేడాది కాలంగా దీని బారిన ప‌డి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

ఇది ప‌రోక్షంగా కూడా ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేసేసింది.అయితే ఇప్పుడు వ్యాక్సిన్లు వ‌స్తున్నా కూడా క‌రోనా కొత్త రూపాల్లో ఇంకా జ‌నాల‌ను వ‌ణికిస్తూనే ఉంది.

మ‌న దేశంలో రెండో వేవ్ స‌మ‌యంలో ఎన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.దీని మీద వ్యాక్సిన్లు ఏ మేర‌కు ప‌నిచేస్తాయ‌నే దానిపై ఇంకా అనుమానాలు ఉన్నాయి.

అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా ఎన్నో ర‌కాల వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.ఇప్ప‌టికే చాలామంది దీని బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.ఎన్ని టీకాలు అందుబాటులోకి వ‌చ్చినా స‌రే ఇంకా క‌రోనా విజృంభిస్తూనే ఉంది.మ‌న దేశంలో అయితే రోజుకో రకం వేరియంట్‌తో వ‌ణికిస్తూనే ఉంది.

ఇక ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కొత్త వేరియంట్ క‌ల‌క‌లం రేపుతోంది.క‌ర్ణాట‌క రాజ‌ధాని అయిన‌టువంటి బెంగళూరు ప‌ట్ట‌ణంలో రీసెంట్ గా ఏవై.4.2 వేరియంట్ కేసులు రెండు నమోదు అయ్యయి.దీంతో ఒక్క‌సారిగా బెంగుళూరు ఉలిక్కిప‌డింది.

Telugu Ay, Bangalore, Corona, Corona Wave, England, Karnataka-Latest News - Telu

దీంతో ఆరోగ్య శాఖ కూడా అల‌ర్ట్ అయిపోయింది.వెంట‌నే ఈ కొత్త వేరియెంట్ మూలాన్ని గుర్తించేందుకు ఆదేశాలు జారీ చేసింది.దీని జన్యు శ్రేణిని క‌నిపెట్టేందుకు ప్రయోగశాలకు శాంపిల్స్ కూడా పంపినట్లు తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ మంత్రి అయిన‌టువంటి సుధాకర్ వెల్ల‌డించారు.కాగా ఈ కొత్త వేరియంట్ సోకిన వ్య‌క్తులు బెంగళూరుకు చెందిన వారేన‌ని, అయితే వారికి ఎలాంటి ల‌క్ష‌ణాలు కూడా లేవంటూ క్లారిటీ ఇచ్చేశారు.ప్ర‌స్తుతం ఏవై.4.2 అనే వేరియెంట్ ఇంగ్లాండ్‌లో స్పీడుగా విస్త‌రిస్తోంద‌ని చెప్పారు.అయితే కాంట్రాక్ట్ లిస్టును గుర్తిస్తున్నామ‌ని దీన్ని అదుపులోకి తెస్తామంటూ వెల్ల‌డించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube