గృహ హింస: కాపురాలు నిలబెట్టే యత్నం, బాధితులకు అండ.. ఇండో అమెరికన్ వైద్యుల కార్యాచరణ

అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

 Indian American Doctors Raise Awareness About Domestic Violence , American Assoc-TeluguStop.com

కొన్ని చోట్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నారు.దీనివల్ల వారి పిల్లలు దిక్కులేని వారిగా మిగులుతున్నారు.

ఇకపోతే అమెరికాలో ఎన్ఆర్ఐ వైద్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది.తాజాగా భారత్, అమెరికా తదితర దేశాలలో గృహ హింసపై ఏఏపీఐలోని మహిళా కమిటీ అవగాహన కల్పించనుంది.

అక్టోబర్ నెల గృహహింసపై అవగాహన కల్పించే మాసం కావడంతో గత వారం జరిగిన వెబ్ కాన్ఫరెన్స్‌లో ఏఏపీఐ సభ్యులు దీనిపై చర్చించి పరిష్కారాలపై సూచనలు చేశారు.ఏఏపీఐ ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ గొట్టిముక్కల మాట్లాడుతూ.

గృహహింసను తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల ప్రకారం.

అమెరికాలోని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు.ప్రతి ఏడుగురిలో ఒక పురుషుడు తమ జీవిత భాగస్వాముల చేతుల్లో శారీరిక హింసను అనుభవిస్తున్నట్లు ఆమె చెప్పారు.

గృహహింస అనేది జాతి, మతం, లింగం, సామాజిక ఆర్ధిక వర్గాలనైనా ప్రభావితం చేయగలదని వక్తలు అన్నారు.

మానవి అనే మహిళా సంస్థ గృహహింస బాధితులకు న్యాయవాదుల ద్వారా అందించిన చట్టపరమైన మద్ధతు గురించి వారు వివరించారు.

కొందరు బాధితులను నేరస్తులుగా చిత్రీకరించి తప్పుడు అభియోగాలు మోపడంతో పాటు బహిష్కరిస్తున్నారని యూకేలో మానవ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న నవనీత్ భల్లా తెలిపారు.ఇలాంటి వారికి మానవి అండగా వుంటుందని.

బాధితులు ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఆమె వెల్లడించారు.

Telugu Aapi Dr Anupama, Indianamerican, Centers Control, Web Conference-Telugu N

కాగా, “ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఏఏపీఐ భారతదేశంలో గ్రామీణ ఆరోగ్యానికి సంబంధించి గత సెప్టెంబర్‌లో అడాప్ట్-ఏ-విలేజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.డాక్టర్ సతీశ్ కత్తుల చైర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుపమ గొట్టిముక్కల, డాక్టర్ జగన్ ఐలాని, డాక్టర్ రామ్‌సింగ్‌లు సభ్యులుగా వున్నారు.ఈ సందర్భంగా ఏఏపీఐ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల అడాప్ట్ ఏ విలేజ్ లక్ష్యాలను వివరించారు.

ఏఏపీఐ గ్లోబల్ టెలిక్లినిక్స్ సహకారంతో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఇండియాలోని 75 గ్రామాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు , తెలంగాణా రాష్ట్రాలలోని గ్రామీణ ప్రజలకు రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, పోషకాహార లోపం, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం , హైపోక్సిమియా వంటి వాటికి ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తామని అనుపమ చెప్పారు ఫలితాలను ఏఏపీఐ గ్లోబల్ టెలి క్లినిక్స్ విశ్లేషించి, తదుపరి చర్యకు సంబంధించి నిపుణుల బృందం సిఫార్సు చేస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube