అమెరికా: యూఎస్ కాంగ్రెస్‌లో దీపావళి వేడుకలు.. హాజరైన భారత సంతతి ప్రముఖులు

భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

 Indian-american Lawmakers And Top Biden Admin Members Celebrate Diwali At Us Con-TeluguStop.com

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.

ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దీవాళీని జరుపుకుంటున్నారు.ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.

అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో అమెరికా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన యూఎస్ కాంగ్రెస్‌లో దీపావళిని జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో పనిచేస్తున్న వారు, మరికొందరు భారత సంతతి ప్రముఖులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల సహకారాన్ని చట్టసభ సభ్యులు ప్రశంసించారు.

అలాగే కోవిడ్ అనంతర ప్రపంచంలో దీపావళి ప్రాముఖ్యతను వారు హైలెట్ చేశారు.

Telugu Biden, Donald Trump, Barack Obama, Indian American, Indianamerican, Congr

ఈ సందర్భంగా యూఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ.గత రెండేళ్లుగా జీవితాలను తలకిందులు చేసిన మహమ్మారి మధ్యలో వున్నామన్నారు.ఇక్కడున్న వారిలో తనతో సహా కుటుంబాల్ని, స్నేహితుల్ని కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.

తన తల్లి బోధనలను గుర్తుచేసుకుంటూ.చీకటిని జయించే కాంతే దీపావళి అని డాక్టర్ మూర్తి అన్నారు.

ఈ సమావేశానికి భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు డాక్టర్ అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ సహా తదితరులు పాల్గొన్నారు.ఈ కాపిటల్ హిల్ దీపావళి వేడుకను ఇండియాస్పోరా సంస్థ అమెరికాలోని ఇతర కమ్యూనిటీ సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube