న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంత్రి కామెంట్స్ : ఈటెల బయట బీసీ లోపల ఓసి

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు.ఆయన బయట బీసీ అని, లోపల మాత్రం ఓసి అంటూ ఎద్దేవా చేశారు. 

2.ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ విమర్శలు

  ఆంధ్రప్రదశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు  

3.చంద్రబాబుపై విజయసాయి రెడ్డి కామెంట్స్

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  టిడిపి నేతలు పట్టాభి చెట్లను సమర్థించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు అని వైసిపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. 

4.కెసిఆర్ పై ఏపీ మంత్రుల ఫైర్

  తెలంగాణ లోని ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు ఎలా ఉన్నాయో ? ఏపీ లోని ప్రభుత్వ టాయిలెట్స్ ఎలా ఉన్నాయో పోల్చి చూస్తే ఏపీలో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనే విషయం కేసీఆర్ కు అర్థమవుతుందని మంత్రి సిరి అప్పల రాజు, అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 

5.టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల కు నోటీసులు

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.దీనిపై వివరణ ఇవ్వాలని నరేంద్ర కు నోటీసులు జారీ చేశారు. 

6.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

7 .క్రేడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సమావేశం

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  క్రేడాయ్ ప్రతినిధులతో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చలు జరిపారు. 

8.స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ పై జగన్ సమీక్ష

  స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు పై తాడేపల్లి సీఎం క్యాంప్ కర్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. 

9.చంద్రదండు అధ్యక్షుడు అరెస్ట్

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  మహిళలపై దారుణం చేసిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 

10.  ఉప ఎన్నికలు : నేటితో ప్రచారానికి ముగింపు

  ఈనెల 30న జరగనున్న ఏపీలోని బద్వేల్ , తెలంగాణలోని హుజురాబాద్  నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. 

11.ఏపీలో రెండు రోజులు వర్షాలు

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

12.మణిపాల్ లో ఆరోగ్యశ్రీ కింద బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ 

  ఏపీ లోని మణిపాల్ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ కింద బొన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ను చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు. 

13.1 వ తేదీ నుంచి యథావిధిగా రేషన్ 

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  ఒకటో తేదీ నుంచి యధావిధిగా రేషన్ పంపిణీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు . 

14.bవరరావుకు బెయిల్ గడువు పొడిగింపు

  భీమా కోరే గావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరావు కు ఊరట లభించింది.బెయిల్ గడువు ముంబై హై కోర్టు పొడిగించింది. 

15.షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల 

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. 

16.కేసీఆర్ నేతృత్వంలో ప్యారిస్ కు తెలంగాణ ప్రతినిధి బృందం

  ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం పయనం అయ్యింది. 

17.నేడు హుజురాబాద్ లో రేవంత్ ప్రచారం

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  హుజురాబాద్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

18.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 27,006 మంది భక్తులు దర్శించుకున్నారు. 

19.పత్తి రైతులపై కేసు కొట్టివేత

Telugu Ap Telangana, Kodali Nani, Rewanth, Gold, Top-Latest News - Telugu

  కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు 18 మంది రైతు సంఘాల నాయకులు, సీడ్ పత్తి రైతులకు నాంపల్లి హైకోర్టులో ఊరట లభించింది.2012లో నమోదైన ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 

20.ఈ రోజు బంగారం ధరలు 

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,130   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,130

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube