ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది.. దీపావళి జరుపుకోవడానికి సరైన సమయం ఇదే..!

హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి.ఈ పండుగను హిందూ ప్రజలు ఎంతో అంగరంగవైభవంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.

 Diwali 2021 Time And Date Of Lakshmi Puja And Shubh Muhurat, Diwali 2021, Diwali-TeluguStop.com

దీపావళి పండుగ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినరోజని భావించి అమ్మవారికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేసుకుంటారు.ఇలా నరకాసురుడి వధ తర్వాత దీపావళి పండుగను జరుపుకుంటారని మనకు తెలిసిందే.

అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, దీపావళి పండుగ జరుపుకోవడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే.

ప్రతి ఏడాది దీపావళి పండుగ కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు.నవంబర్ 4వ తేదీ చతుర్దశి ఉదయం 4:25 నిమిషాలకు ప్రారంభమై ఆ తర్వాత అమావాస్య ప్రారంభం అవుతుంది.అమావాస్య నవంబర్ 5వ తేదీ ఉదయం 3:51 వరకు ఉంటుంది.పురాణాల ప్రకారం నరకాసురుడి వధకు గుర్తుగా చతుర్దశి రోజున నరక చతుర్దశి నాడు జరుపుకుంటారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అయితే ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా బంధువులు సన్నిహితులకు కానుకలను పంపిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.

అలాగే టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube