'గని' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..ఇన్స్పైర్ చేస్తున్న సాంగ్!

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

 Varun Tej Gani Movie First Single Out Now Details, Varun Tej, Gani, First Single-TeluguStop.com

ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇక కరోనా తగ్గి థియేటర్స్ మళ్లీ మునుపటిలాగా తెరుచు కోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

గని ఆంథెమ్ పేరుతొ ఈ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.”నీ జగజగడం.వదలకురా కడవరకు.ఈ కథన గుణం.అవసరమే ప్రతి కలకు” అంటూ సాగుతున్న ఈ పాట క్రీడాకారులను ఇన్స్పైర్ చేస్తుంది.

రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ లిరిక్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరొకసారి మాస్ బీట్స్ కలిపి ఇరగ దీసాడు.ఈ సాంగ్ ఆద్యంతం ఎనర్జిటిక్ గా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడు.

బాక్సర్ అవ్వడం కోసం కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వంటివి ఈ పాటలో చూపించారు.ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కనిపిస్తున్నాడు.

ఈ సాంగ్ చుసిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

ఇక వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్ ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube