హుజూరాబాద్‌లో అలాంటి రాజ‌కీయాలు చేస్తున్న హ‌రీశ్‌.. కార‌ణం ఇదేనా..?

హుజురాబాద్ పోరులో గెలుస్తామో? లేదో అనే అనుమానం టీఆర్ఎస్ పార్టీకి మొదలైందా అంటే అవుననే అంటున్నారు కొందరు నేతలు.గెలుపు మీద అనుమానం కలిగింది కనుకనే ట్రబుల్ షూటర్ గా పిలిచే హరీశ్ రావు అనేక రకాలుగా ఆచరణ సాధ్యం కానీ హామీలను గుమ్మరిస్తున్నారని అంటున్నారు.

 Is Harish Doing Such Politics In Huzurabad .. Is This The Reason Huzurabad, Har-TeluguStop.com

మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే ఆ హామీలను నెరవేరుస్తామని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎలాగైనా సరే గెలిపించుకోవాలని అధికార పార్టీ అనేక రకాలుగా ఎత్తులు వేస్తోంది.

నియోజకవర్గంలో ఉన్న దళితుల ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవడం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.కానీ అనుకోని విధంగా వేరే సామాజిక వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది.

దీంతో టీఆర్ఎస్ అన్ని సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది.ఎవరు ఏమని అడిగినా సరే చేసేందుకు సై అంటోంది.

మరి టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేరుతాయో లేదో చూడాలి.

ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు స్వయంగా హుజురాబాద్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.

కానీ ఆయన కూడా అనేక రకాలుగా ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఉదాహరణకు తీసుకుంటే.ఐదు వేల డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, అంతే కాకుండా వ్యవసాయ రుణాలు వడ్డీతో సహా మాఫీ, 57 సంవత్సరాలకే కొత్త ఫించన్లు తదితరాలు ఉన్నాయి.

Telugu Bjp, Dalitha Bandhu, Etala, Harish Rao, Huzurabad, Trs, Ts Potics-Telugu

దళిత సామాజిక వర్గం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఎంత మేరకు ఓట్లు రాలుస్తుందో అని టీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారట.అందుకోసమే అన్ని కులాలతో సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.ఎవరు ఏం అడిగినా కాదనకుండా అన్నింటికీ సరే అంటున్నట్లు సమాచారం.

బీజేపీతో పోల్చి చూసుకుంటే టీఆర్ఎస్ ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యం కాకుండా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube