జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుపై అంచ‌నాలు వేసేస్తున్న వైసీపీ.. ఆ జిల్లాల‌పైనే ఫోక‌స్‌

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఓ అంశం బాగా పాపుల‌ర్ అయిపోతోంద‌తి.అదే జ‌న‌సేన, టీడీపీ పొత్త అంశం.

 Ycp Is Making Predictions On Janasena And Tdp Alliance. Focus On Those Districts-TeluguStop.com

ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటాయ‌ని, వైసీపీని ఓడిస్తాయ‌నే ప్ర‌చారం బాగానే ఊపందుకుంది.దీంతో అటు అధికార వైసీపీ పార్టీ కూడా అల‌ర్ట్ అయిపోయింది.

ఒక‌వేల టీడీపీ, జ‌న‌సేన పొత్త పెట్టుకుంటే గ‌న‌క ఈ ద్వ‌యాన్ని ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై ఇప్ప‌టి నుంచే పెద్ద ఎత్తున వ్యూహాలు ర‌చిస్తోంది.ఎందుకంటే గ‌తంలో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసింది కాబ‌ట్టి ఎదుర్కోవ‌డం ఈజీ అయిపోయింది.

కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే గ‌న‌క వైసీపీకి బ‌ల‌మైన పోటీ త‌ప్ప‌దు.

ఇందులో భాగంగా ఇప్పటి నుంచే అస‌లు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏయే జిల్లాల్లో ఎఫెక్ట్ ప‌డుతుంద‌నే దానిపై ఇప్ప‌టి నుంచే అంచనాలు వేసుకుంటోంది.

ఇటు తెలంగాణ‌లో మాత్రం ఎలాంటి పొత్తులు లేక‌పోవ‌డంతో అధికార టీఆర్ ఎస్‌కు అది క‌లిసి వ‌చ్చే అంశం.కానీ ఏపీలో మాత్రం రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే మాత్రం అది వైసీపీకి పెద్ద న‌ష్ట‌మ‌నే చెప్పాలి.

దీంతో అధికార వైసీపీ పూర్తి స్థాయిలో ఏయే జిల్లాల్లో ఎఫెక్ట్ ప‌డుతుంద‌నే దానిపై ఇప్ప‌టి నుంచే స్ట‌డీ చేస్తోంది.ప్ర‌ధానంగా ఉభ‌య గోదావరి జిల్లాల్లోనే ఈ పొత్తు ప్ర‌భావం ఉంటుంద‌ని వైసీపీ భావిస్తోంది.
 

Telugu Ap Potics, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan, Ysrcp-Telugu Po

అయితే ఇక్క‌డ ఆ పొత్తు ప్రభావం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అంటే 34 నియోజకవర్గాల్లో కాకుండా కేవ‌లం పది లేదా పదిహేను వాటిల్లో మాత్ర‌మే ఉంటుంద‌ని అంచనా వేస్తోంది.ఈ నేప‌థ్యంలో ఎలాగైనా ఆ జిల్లాల్లో త‌న ప‌ట్టు పెంచుకోవాల‌ని వ్యూహంతో ముందుకు సాగాల‌ని చూస్తోంది.ఇప్ప‌టికే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది.కాబ‌ట్టి ఇంకాస్త జాగ్ర‌త్త ప‌డితే గ‌న‌క ఈ పొత్తును చిత్తు చేయొచ్చ‌నే భావ‌న‌తో వైసీపీ ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో రెండు పార్టీలను చిత్తుగా ఓడించిన‌ట్టుగానే మ‌రోసారి ఓడించేందుకు అదే అభ్య‌ర్థులను మ‌రింత ప‌ట్టు పెంచుకునేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube