టీఆర్ఎస్ లో ఏదో జరుగుతోంది ? ప్లీనరీలో కనిపించని హరీష్ కవిత ?

టీఆర్ఎస్ ప్లీనరీ ధూమ్ ధామ్ గా జరిగింది.అదిరిపోయే ఏర్పాట్లతో పాటు , అదరగొట్టే ప్రసంగాలతో ప్లీనరీలో కేసీఆర్, కేటీఆర్ లు ఆకట్టుకున్నారు.

 Hareesh Rao, Telangana, Trs, Trs Plinary Mlc Kavitha, Minister Hareesh Rao, Ktr,-TeluguStop.com

హైటెక్స్ లో నిర్వహించిన ఈ ప్లీనరీ లో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.కీలకమైన పార్టీ నేతలందరికీ ఆహ్వానాలు అందాయి.

అయితే టిఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్లీనరీకి తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న మంత్రి హరీష్ రావు హాజరు కాలేదు.అలాగే కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్లీనరీ జరిగే సమయంలో హైదరాబాద్ లోనే ఉన్నా,  ఆమె కూడా హాజరు కాకపోవడంతో  టిఆర్ఎస్ అగ్ర నాయకుల మధ్య ఏదో ఆధిపత్య పోరు నడుస్తోంది అనే విషయం అందరి  మధ్య చర్చనీయాంశం అయింది.

ఇక ఈ విషయాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి టిఆర్ఎస్ ప్రత్యర్థులు లేవనెత్తారు.అసలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమకాలంలో కెసిఆర్ కు అండగా నిలబడిన హరీష్ రావు ఈ ప్లీనరీలో కనిపించకపోవడం తో ఆయనను పక్కన పెడుతున్నారనే అభిప్రాయం పార్టీ నేతల్లో కలుగుతోంది.

అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇన్చార్జిగా హరీష్ ఉన్నారు.దీంతో ఆయనను ప్లీనరీకి రావద్దని కేసీఆర్ చెప్పారట.హుజురాబాద్ లోనే ఉండి అక్కడ ఎన్నికల వ్యవహారాలను చూసుకోవాలని కెసిఆర్ సూచించడంతో , హరీష్ రావు హాజరు కాలేనట్టు టిఆర్ఎస్ లోని ఓ వర్గం చెబుతోంది.కనీసం కేసీఆర్ కుమార్తె కవిత అయినా హాజరయ్యే అవకాశం ఉన్నా, ఆమె కూడా హైదరాబాద్ లోనే ఆ సమయంలో ఉన్నా, ఆ సమావేశానికి వెళ్ళలేదు.

చాలా కాలంగా కవిత టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.దీంతో ఆమెకు కేటీఆర్ కు మధ్య గొడవ లు ఉన్నాయని,  అందుకే ఆమె సైలెంట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

దీంతోపాటు టిఆర్ఎస్ కు అండగా ఉంటూ వస్తున్న పత్రికలోను కవితకు సరైన కవరేజ్ లభించకపోవడంతో,  ఇది నిజమేనా అనే అభిప్రాయాలు జనాలు కలుగుతున్నాయి.

Telugu Hareesh Rao, Hujurabad, Telangana, Trsplinary-Telugu Political News

ఇప్పుడు ప్లీనరీకి ఆమె హాజరు కాకపోవడంతో దీనికి మరింత బలం చేకూర్చినట్టయింది.ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గం లో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించినా, అది అంతగా ఫోకస్ కాలేదు.ఇక హరీష్ రావు సంగతి కి వస్తే గత కొంతకాలంగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూనే వస్తుంది.

అయితే హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ హరీష్ రావు తో సన్నిహితంగా మెలుగుతున్నారు.కానీ అతి ముఖ్యమైన టీఆర్ఎస్ ప్లీనరీకి మాత్రం ఆయనను రావద్దని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

హరీష్, కవిత పార్టీ ప్లీనరీలో కనిపించకపోవడమే ఈ చర్చ కు కారణం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube