టీఆర్ఎస్ కు బీజేపీ మధ్య భీకర పోటీ...రేపటితో ముగియనున్న ప్రచారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనున్నది.దీంతో ఇక చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించాలని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు యోచిస్తున్నాయి.

 Fierce Competition Between Trs And Bjp Campaign Ending Tomorrow, Bandi Sanjay, T-TeluguStop.com

అందుకు తగ్గట్టుగా తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే బీజేపీ పార్టీ మాత్రం టీఆర్ఎస్ ను ఓడించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.ఇక టీఆర్ఎస్ మాత్రం గెలుపుపై పెద్ద ఎత్తున నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే దళిత బంధు పధకం విజయవంతంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తుండటంతో దళితులు ఎక్కువ శాతం టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఎన్నికల కమిషన్ దళిత బంధు పంపిణీని నిలుపుదల చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని టీఆర్ఎస్ చేసిన ప్రచారం బలంగా దళితుల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది.

ఇది బీజేపీకి మైనస్ గా మారింది.ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో నలభై వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్ళు సైతం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఉంది.

Telugu @bjp4telangana, Bandi Sanjay, Huzurabad, Dalitabandhu, Etela Rajender, Ha

ఎవరు గెలిచినా వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.అందుకే ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ కాని, మరల మూడవ సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక చాలా కీలకమని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా టీఆర్ఎస్- బీజేపీ మధ్య జరుగుతున్న  ఈ భీకర పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube