మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన సాంప్రదాయాలు అనేవి ఉంటాయి.మన తెలంగాణలో బతుకమ్మ ఎలాగో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అలాంటి సంప్రదాయ పండుగలే ఉంటాయి.
ఇందుకోసం అక్కడి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రం కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి.
ఎందుకంటే గుజరాతీయుల సంప్రదాయాలు చాలా విభిన్నంగా ఉంటాయి.వారు చేసే సంప్రదాయ నృత్యాలు గానీ లేదంటే ఆటలు గానీ ఎంతో ఆకట్టుకుంటుంటాయి.
ఇందులో భాగంగా ఇప్పుడు ఓ విషయం గురించి తెలుసుకుందాం.
గుజరాత్ అనగానే ఎక్కువగా రాజ్‌పుత్ వర్గానికి చెందిన ప్రజలు చాలా టక్కున గుర్తుకు వచ్చేస్తుంటారు.
ఎందుకంటే వీరు చేసే పండుగలు ఎంతో ప్రత్యేకం.కాగా ఈ వర్గానికి చెందిన మహిళలు రీసెంట్గా చేసిన ఓ సంప్రదాయ నృత్యం వీడియో ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి మహిళలు ఎప్పుడూ కత్తులతో డ్యాన్స్ చేయడం మనం చూడలేదు.ఎక్కువగా మొగవారు మాత్రమే ఇలా కత్తులతో డ్యాన్సులు చేస్తుంటారు.
కానీ ఇప్పడు మనం చూస్తున్న వీడియోలో మాత్రం ఏకంగా 200 మంది మహిళలు ఓ బృందంగా ఏర్పడి కత్తులతో నృత్యం చేస్తున్నారు.
ఇది చాలా డేరింగ్ తో కూడుకున్న పనే అని చెప్పాలి.అయితే రాజ్ పుత్ మహిళలకు దేవీ నవరాత్రులు అంటే చాలా స్పెషల్.ఈ పండుగలో భాగంగా మహిళల వీరత్వాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఇలా రాజ్ పుత్ మహిళలు తల్వార్ రాస్ పేరుతో ఈ విధంగా సంప్రదాయ నృత్యం నిర్వహించారు.
దాదాపు 12 ఏళ్ల నుంచి ఇలా కత్తుల డ్యాన్స్‌ను వీరు కొనసాగిస్తున్నారు.ప్రతి ఏటా నవరాత్రులలో భాగంగా ఇలా ఐదు రోజుల పాటు సంబురాలు జరుపుకుంటారు రాజ్ పుత్‌లు.
ఇంకో విషయం ఏంటంటే ఈ మహిళల కత్తుల నృత్యం ఏకంగా గిన్నిస్ రికార్డులోకి కూడా ఎక్కింది.
.