వరుడు కావలెను మూవీని రిజెక్ట్ చేసిన యంగ్ హీరో ఎవరో మీకు తెలుసా?

లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వరుడు కావలెను మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లక్ష్మీ సౌజన్య మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Interesting Facts About Nagashourya Varudu Kavalenu Movie Details, Interesting F-TeluguStop.com

సినిమాలు, సినిమాలలోని పాత్రల నుంచి చాలామంది స్పూర్తి పొందుతారని సినిమాల ద్వారా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు.

పది మందిని బాగా చేయకపోయినా ఎటువంటి నష్టం లేదని అయితే ఒకరిని కూడా తప్పుదోవ పట్టించకూడదని లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు.

సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించగా పీడీవీ ప్రసాద్ ఈ సినిమాను సమర్పించారు.లక్ష్మీ సౌజన్య తాను నాగచైతన్యకు మొదట ఈ సినిమా కథను చెప్పానని అయితే చైతన్యతో ప్రాజెక్ట్ కుదరలేదని తెలిపారు.

కర్నూలు జిల్లాలో తాను పుట్టానని గుంటూరు జిల్లాలో పెరిగానని తాను 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని లక్ష్మీ సౌజన్య పేర్కొన్నారు.

మొదట నిర్మాత చినబాబుకు వరుడు కావలెను లైన్ చెప్పానని ఆయనకు లైన్ నచ్చడంతో ఆ తర్వాత కథను సిద్ధం చేశానని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు.

Telugu Naga Chaitanya, Nagashourya, Rithuvarma, Suryadevaranaga, Tollywood, Varu

సినిమాలో నాగశౌర్య అర్కిటెక్చర్ గా కనిపిస్తారని రీతూవర్మ భూమి అనే పాత్రలో కనిపిస్తారని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు.విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం.సినిమాలో మాస్ సాంగ్స్ కొరకు థమన్ ను తీసుకున్నామని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు.

Telugu Naga Chaitanya, Nagashourya, Rithuvarma, Suryadevaranaga, Tollywood, Varu

తాను డైరెక్టర్ గా పెద్ద నిర్మాణసంస్థ నుంచి పరిచయమవుతున్నానని తనకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మీ సౌజన్య పేర్కొన్నారు.సినిమా రంగంలో ప్రతిభ ఉంటే మాత్రమే ప్రోత్సాహం లభిస్తుందని గుర్తింపు కోసం తపనతో సినిమాలు చేస్తున్నానని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు.సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం నాగచైతన్య ఈ సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడనే కామెంట్లు వినిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube