టీమిండియాలో మ‌త వివ‌క్ష అంటున్న అస‌దుద్దీన్‌..

క్రికెట్ అనేది దేశానికి సంబంధించింది.ఓ వ‌ర్గానికి లేదంటే ఓ రాష్ట్రానికి సంబంధించింది కాదు.

 Asaduddin Speaks Of Discrimination In Team India Details, Team India, Asaduddin-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ఏ మ‌తానికి ఏ కులానికి చెందిన ఆట కాదు.దేశం త‌ర‌ఫున ఆడే ఆట‌గా క్రికెట్‌ను మ‌న దేశంలో ఎంత ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే.

క్రికెట్‌లో టీమ్ ఇండియా ఓడిపోతే ఏకంగా దేశ‌మో ఓడిపోయింద‌న్న భావ‌న‌తో బాధ‌ప‌డ‌టం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం.కాగా దాయాది పాకిస్తాన్‌తో ఆట అంటే ఇంకెంత క్రేజ్ వ‌చ్చేస్తుందో తెలిసిందే.

పాకిస్తాన్ మీద గెల‌వాల‌న భావ‌న ప్ర‌తి స‌మాన్య అభిమానికి కూడా ఉంటుందంటే దీని ప్ర‌భావం అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇప్పుడు ఎంఐఎం అధినేత అయిన‌టువంటి అసదుద్దీన్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

మొన్న దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా భారత్ ఓటమిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.అయితే కొంద‌రు నెటిజన్లు చాలా లోతుగా వెళ్లి మ‌రీ రాజకీయ నేతలతో పాటు కొంద‌రు క్రీడాకారులను టార్గెట్ చేసి తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై అసదుద్దీన్ స్పందించారు.ఆయ‌న మాట్లాడుతూ టీమ్ ఇండియాలో మ‌త వివ‌క్ష చూపిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Telugu Asaduddin, Pak, Mimasaduddin, Cup, India-Latest News - Telugu

మ్యాచ్ సంద‌ర్భంగా ష‌మీ వ‌వేసిన‌టువంటి లాస్ట్ ఓవర్ పాకిస్తాన్ టీమ్ విజ‌యం సాధించ‌డానికి కారణమయింద‌ని అందుకే అత‌ని వ‌ల్లే ఓడిపోయామంటూ కొంద‌రు మాట‌లాడుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు అస‌దుద్దీన్‌. ఇండియా ఓడిపోవ‌డానికి షమీ ఒక్కడే కార‌ణం కాద‌ని షమీని టార్గెట్ చేయ‌డం ఆపాలంటూ కోరారు.ఇలా షమీని మాత్ర‌మే టార్గెట్ చేస్తూ మిగ‌తా వారిని ఏమీ అన‌క పోవ‌డం విద్వేషాన్ని ర‌గిల్చ‌డ‌మే అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఆట‌ను ఆట‌లాగే చూడాల‌ని దాన్ని సామాజిక కోణంలో చూడొద్దంటూ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇలా కేవ‌లం ముస్లిమ్ క్రికెట‌ర్‌ను టార్గెట్ చేయ‌డం మంచిది కాదంటూ అభిప్రాయ ప‌డ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube