పసుపు పచ్చ చేప గురించి ఎప్పుడైనా విన్నారా.?

మనకు దొరికే చేపల్లో చాలా రకాలున్నాయి.అయితే కొన్ని చేపలు తినగలం, కొన్ని చేపలు తినలేము.

 Ever Heard Of Yellow Emerald Fish. Yellow Fish, Viral Latest, Viral Latest, News-TeluguStop.com

తినలేని చేపలను ఆక్వేరియంలో వేసి వాటిని చూస్తూ ఆనందిస్తాం.అయితే చేపలు పట్టడానికి, చెరువులు సముద్రాలను ఎక్కువగా ఆశ్రయిస్తుండటం మనకు తెలిసిందే.

చేపలు పట్టడం కొందరికి జీవనాధారం అయితే, కొందరికి అదొక హాబీ.అయితే, సముద్రాల్లో చేపలు పట్టేవారికి వింత వింత చేపలు వలకు చిక్కుతూ ఉంటాయి.

అలాగే నెదర్లాండ్ కి చెందిన ఒక వ్యక్తికి ఓ వింత చేప వలలో పడింది.ఆ చేప చూడడానికి పసుపు పచ్చ రంగులో ఉంది.

ఆ పసుపు పచ్చ చేప గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెదర్లాండ్స్ కు చెందిన మార్టిన్ గ్లాట్జ్ ఒక రోజు నదిలో చేపల వేటకు వెళ్లగా అక్కడ అతనికి అనుకోకుండా ఒక వింత చేప వలలో పడింది.

అది అరటిపండు కలర్ లో ఉండడం చూసిన మార్టిన్ ముందు ఆశ్చర్యపోయాడు.తరువాత తన దగ్గర ఉన్న అందరికి చూపించాడు.అయితే ఈ చేపల్లో లూసిజం అనే జన్యుపరమైన వ్యాధి ఉండడం వల్ల అవి పసుపు రంగులోకి మారుతాయి.లూసిజం అనే వ్యాధి ఉండడం వల్ల జంతువు శరీరం రంగు మారడమే కాకుండా చర్మం, జుట్టు కూడా తేడాగా ఉంటుంది.

Telugu Fish, Latest, Yellow Fish-Latest News - Telugu

అయితే ఇలాంటి చేపలే 2017 ప్రారంభం లో యూఎస్ లోని అయోవాలో ఉన్న మిస్సిసిప్పీ నదిలో పసుపు రంగులో ఉన్న క్యాట్ ఫిష్ కనిపించింది.మళ్ళీ ఇప్పుడు రెండో సారి కనిపించింది.కానీ ఇంత అందంగా ఉన్న ఈ చేపలు మాత్రం తినడానికి పనికిరావని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు.అలాగే ఈ చేపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఈ పసుపు పచ్చ చేపలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube