బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన శైలిలో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలియా భట్ బాలీవుడ్ సీనియర్ నటీనటులు మహేశ్ భట్, సోనీ రాజ్దాన్ సంతానం అనే విషయం మనకు తెలిసిందే.తాజాగా ఆలియా తల్లి సోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తను 1986 లో ప్రేమ వివాహం చేసుకున్నానని వివాహం తర్వాత 1988 లో షాహీన్ భట్, జన్మించగా 93లో అలియాకు జన్మనిచ్చినట్లు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఆమె ఇండస్ట్రీలోకి ఏవిధంగా అడుగుపెట్టారనే సంగతి వివరించారు.
అలియా పుట్టిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలగటంతో ఇంట్లో తన భర్తకు తెలియకుండా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు సోనీ తెలియజేశారు.అయితే చాలామందిని కలవగా ప్రతి ఒక్కరూ మీకు పెళ్లి అయిందా కదా.అని అడుగుతూ తనకు అవకాశాలు ఇవ్వడంలేదని ఈ సందర్భంగా అలియా తల్లి సోని తెలిపారు.
ఇలా సినిమాలలో కొనసాగడానికి చాలా ప్రయత్నాలు చేశానని ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాల్లో విభిన్న పాత్రలలో చేయడమే కాకుండా, ఓటీటీలో కూడా పలు షోలు చేసింది.ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ‘కాల్ మై ఏజెంట్’ నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇక అలియా కూడా మొట్టమొదటిసారిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.