ఆఫ్ఘాన్ లో 100 మంది భారతీయులు...ప్రధానికి వినతుల వెల్లువ...

అమెరికా ఆఫ్హాన్ లో తమ బలగాలను ఉపసంహరించుకున్న తరువాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే.తాలిబన్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని స్వాధీన పరుచుకోవడం చేసిన దాడులు అన్నీ ఇన్నా కావు.

 Indians Wants To Return India From Afghanistan,  Afghanistan, India, Afghans, Af-TeluguStop.com

చేతికి దొరికిన వారిని అత్యంత కిరాతకంగా చంపేశారు.తమ టార్గెట్ లిస్టు ఉన్న వారిని ఊచకోత కోశారు.

మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించారు ఇలా వారి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.ఈ క్రమంలో భారత్, అమెరికాలు ఆఫ్హాన్ లో ఉన్న తమ వారిని ప్రత్యేక విమానాల ద్వారా వారి వారి దేశాలకు తరలించాయి, ఈ క్రమంలో ఎంతో మంది ఆఫ్హాన్ పౌరులు సైతం విమానాల ద్వారా ఆఫ్ఘాన్ వీడారు.ఇదిలాఉంటే

భారత్ అప్పటి వరకూ ఆఫ్ఘాన్ వెళ్ళే వారికి ఇచ్చిన వీసాలను రద్దు చేసి ఈ – వీసాలను హడావిడిగా మొదలు పెట్టిది.ఈ –వీసా ఉన్నవారికి మాత్రమే భారత్ లోకి వచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.

దాంతో ఈ –వీసా పొందిన భారతేతరులు భారత్ లో తలదాచుకున్నారు.ప్రత్యేక విమానాల ద్వారా ఆఫ్ఘాన్ లో ఉద్యోగాలు , వ్యాపారాలు చేసుకుంటున్న ఎంతో మంది భారతీయులు భారత్ కు తిరిగి వచ్చేశారు.

ఆఫ్ఘాన్ లోని స్థానిక వ్యాపారులు, సంపన్నులు, రాజకీయ నాయకులను కూడా పెద్ద మనసుతో భారత్ లోకి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం.అయితే తాజాగా

ఆఫ్ఘాన్ లో మరో 100మంది భారతీయులు ఉండిపోయారని, ఇప్పుడు వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణ భయం కూడా వారిని వెంటాడుతోందని, వారదరిని భారత్ రప్పించాలని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ భారత్ ప్రధాని మోడీ కు లేఖ రాసింది.

మిగిలిపోయిన 100 మందిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారని వారిని భారత్ రప్పించేలా చర్యలు చేపట్టాలని కోరింది.వీరితో పాటు మరో 100 మంది ఆఫ్ఘాన్ పౌరులు భారత్ వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఇలా మొత్తం 200 మంది భారత్ వచ్చేందుకు అభ్యర్దిస్తున్నారని స్వచ్చంద సంస్థలు మోడీకి రాసిన లేఖలో తెలిపారు.

వీరందరికీ ఈ –వీసాలు జారీ చేసి వెంటనే భారత్ రప్పించాలని కోరుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube