లాక్‌డౌన్ ఎఫెక్ట్: జనంలో తగ్గిన డ్రైవింగ్ స్కిల్స్.. సిడ్నీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్, విశ్లేషణ

కోవిడ్ కారణంగా ఆస్ట్రేలియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.దాదాపు మూడు నెలల నుంచి వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని కీలక నగరాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది.

 Sydney’s Traffic Returning To Pre-covid Levels As Driving Skills Deteriorate ,-TeluguStop.com

అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు లాక్‌‌డౌన్‌ ఎత్తివేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే టీకా టార్గెట్‌ను చేరుకోవడంతో దాదాపు 107 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన లాక్‌డౌన్‌ నుంచి సిడ్నీ వాసులకు గత సోమవారం విముక్తి కలిగింది.

ప్రభుత్వ నిర్ణయంతో పబ్‌లు, రెస్టారెంట్లు, దుకాణాలు సైతం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ప్రజలు రోడ్లపైకి రావడంతో సిడ్నీలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది.

బస్సులు, రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలలో జనం కిక్కిరిసి వుండటం, వ్యాపార సముదాయాల్లో రద్దీ, పిల్లలు పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సిడ్నీలో పరిస్ధితిని తెలియజేస్తున్నాయి.ఇదే సమయంలో ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో కోవిడ్ ఆంక్షలను మరింత సడలించింది.దీనిలో భాగంగా 16 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇకపై కార్యాలయాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదు.

అలాగే ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలో, ఆరుబయట గుమిగూడటానికి అనుమతిస్తూ న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే లాక్‌డౌన్ పౌర సమాజానికి, ప్రభుత్వానికి ఎన్నో నష్టాలను కలిగించింది.

అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది.ఎందరో మానసిక అనారోగ్యానికి గురవ్వగా.

ఇంకొందరు పలకరించే దిక్కు లేక ఒంటరిగా గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.ఎటూ కదిలే వీలు లేకపోవడంతో పలువురు ఊబకాయం బారినపడ్డారు.

ఇక 107 రోజుల లాక్‌డౌన్‌కు చెక్ పడటంతో నగరవాసులు తమ సొంత వాహనాలను బయటకు తీయడంతో సిడ్నీ రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ నెలకొంది.అయితే కొందరు వాహనదారులలో డ్రైవింగ్ స్కిల్స్ తప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.

Telugu Australia, Lockdown, Wales, Sydney, Sydneys, Sydneyspre-Telugu NRI

న్యూసౌత్ వేల్స్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.లాక్‌డౌన్ ఎత్తివేతకు ముందు 18 శాతంగా రోడ్ల వినియోగం ఆంక్షల సడలింపు తర్వాత 97 శాతానికి చేరుకుంది.ప్రజా రవాణా వ్యవస్థ కూడా తిరిగి గాడిలో పడుతోంది.లాక్‌డౌన్ ఎత్తివేసిన తొలి వారం 4,20,000 ట్రిప్పులు నడవగా.అది ఈ వారం ప్రారంభానికే 6,23,000 ట్రిప్పులకు చేరింది.లాక్‌డౌన్ కారణంగా ప్రజలలో డ్రైవింగ్ స్కిల్స్ మరింత దిగజారిపోయినట్లుగా తెలుస్తోంది.

స్టీరింగ్ పట్టుకుని నెలలు గడుస్తున్నందున డ్రైవర్లలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో పాటు జాగ్రత్త ఎక్కువైందని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యంగా పార్కింగ్ వంటి సమయాల్లో కొందరిలో ఆందోళన కనిపిస్తోందన్నారు.

అటు లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పాదచారుల సంఖ్య గణనీయంగా 113 శాతం పెరిగినట్లు నిపుణులు తెలిపారు.ఇదే సమయంలో రైలు బోగీలు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube