ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన స్టార్స్.. ఆ లిస్టులో ఉన్నదెవరంటే..?

ఫస్ట్ మూవీతోనే హిట్ సాధిస్తే ఆ కిక్కే వేరు.ఎక్కువ ప్రయత్నాలు లేకుండా ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన హీరో, హీరోయిన్ గురించి తెలుసుకుందామా.

 Tollywood Stars First Movie Hit, First Movie , Uday Kiran , Tharun , Ramcharan C-TeluguStop.com

ఉదయ్‌కిరణ్, రిమాసేన్ హీరో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ చిత్రం.ఇది 2000 సంవత్సరంలో రిలీజైంది.

తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.ఇక తరుణ్, రిచా పల్లోద్ ను వెండితెరకు పరిచయం చేసిన మూవీ నువ్వే కావాలి.2000 సంవత్సరంలో రిలీజైన ఈ మూవీ విజయ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కింది.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక 2002 లో వచ్చిన మూవీ జయం.తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నితిన్, సదా ఫస్ట్ టైం నటించారు.అప్పట్లో ఈ మూవీ మంచి హిట్ సాధించింది.

Telugu Alluarjun, Chitram, Devadas, Gangotri, Heros, Tharun, Tollywood, Tollywoo

కె రాఘవేందర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన గంగోత్రి మూవీ 2003లో రిలీజైంది.ఈ మూవీతో అల్లుఅర్జున్, అదితి అగర్వాల్ ఇండస్ట్రీకి పరిచయమ్యారు.ఫస్ట్ మూవీతోనే వీరిద్దరు మంచి హిట్ సొంతం చేసుకున్నారు.2006లో రిలీజ్ అయిన దేవదాసు మూవీతో రామ్ పోతినేని, ఇలియానా ఇండస్ట్రీకి వచ్చారు.వైవీఎస్ చౌదరి డైరెక్షన్ వచ్చి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

Telugu Alluarjun, Chitram, Devadas, Gangotri, Heros, Tharun, Tollywood, Tollywoo

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ తేజ్ చిరుత మూవీతో వెండితెరపైకి వచ్చాడు.నేహా శర్మ ఇందులో హీరోయిన్ పూరి‌జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది.

ఇక ఇటీవలే విడుదలైన ఉప్పెన మూవీలో మెగా ఫ్యామిలీ తరపున వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు.ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్నారు.

ఇక 2008లో వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా, 2012లో వచ్చిన ఈరోజుల్లో మూవీస్‌లోనూ కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో హీరోయిన్స్ మంచి హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube