న్యూస్ రౌండప్ టాప్ 20

1.హైదరాబాదులో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  హైదరాబాద్ రెండు రోజులుగా అనేక చోట్ల 2, 3 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుండడంతో చరిత్ర పెరిగింది. 

2.జగన్ కేసీఆర్ పై నారాయణ ఆగ్రహం

  ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంతో పాటు ముఖ్యమంత్రులు దొంగల ముఠా గా మారారు అంటూ విమర్శించారు. 

3.రేపు ఢిల్లీకి చంద్రబాబు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

టిడిపి అధినేత చంద్రబాబు కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ లభించడంతో రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. 

4.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 28,154 మంది భక్తులు దర్శించుకున్నారు. 

5.షర్మిల పాదయాత్ర

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది.ఈరోజు పాదయాత్రను ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం గ్రామం నుంచి షర్మిల ప్రారంభించారు. 

6.27 నుంచి కేయూ దూరవిద్య పరీక్షలు

  కాకతీయ యూనివర్సిటీ దూర విద్య కేంద్రం డిగ్రీ బి ఏ , బీకాం బీఎస్సీ, బీబీఏ , బీబీఎం ప్రథమ , ద్వితీయ ఏడాది పీజీ ప్రథమ ఏడాది వార్షిక పరీక్షలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నారు. 

7.ప్రశాంతంగా పీఈ సెట్ ప్రవేశ పరీక్ష

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యం తెలంగాణ వ్యాప్తంగా 14 కేంద్రాలు శనివారం నిర్వహించిన టి ఎస్ పి ఈ సెట్ కు 3,133 మంది హాజరయ్యారు. 

8.  ఎండి ఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

  మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలో ప్రవేశాలు నోటిఫికేషన్ ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వేరువేరుగా విడుదల చేసింది. 

9.గాంధీజీ విగ్రహం ధ్వంసం

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  విజయనగరం జిల్లా మెంటాడ మండలం మేడిపల్లిలో ని హై స్కూల్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది.గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 

10.ఈనెల 28న ఏపీ కేబినెట్ సమావేశం

   ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈనెల 28న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 

11.నేడు రేపు ఏపీలో వర్షాలు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  రానున్న 48 గంటల్లో ఏపీ లోని అనేక కాంతులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

12.షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్

  తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కలిశారు. 

13.బండి సంజయ్ పై రేవంత్ విమర్శలు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  కరీంనగర్ పట్టణంలో మురళీధర్రావు ఫ్లెక్సీ పెట్టారు కానీ, స్టాంప్ సైజ్ లో కూడా సంజయ్ ఫ్లెక్సీ పెట్టలేదు.విద్యాసాగర్ రావు , మురళీధర్ రావు లు నిన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థమయ్యిందా ? నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ బండి సంజయ్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

14.26 దేశవ్యాప్త ఆందోళన

  26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దేశవ్యాప్తంగా  కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు విషయంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

15.రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు రేపు హైదరాబాద్ లోని హైటెక్స్ జరగనున్నాయి.ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

16.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

17.రేపే టీఆర్ఎస్ ప్లీనరీ

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  హైదరాబాద్ లోని హెచ్ ఐ సి సి లో సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. 

18.నవంబర్ 8 నుంచి పోడు దరఖాస్తులు

  తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రామాల వారిగా, గిరిజన, ఇతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

19.తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు

Telugu Ap Telangana, Bandi Sanjay, Chandrababu, Hyderabad, Jagan, Ram Nath Kovin

  ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు  

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,660   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,660.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube