అమెరికా: కమలా హారిస్ విజయగాథపై మరో పుస్తకం.. రచయిత ఒక భారత సంతతి జర్నలిస్ట్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు.ఈ గడ్డపై ఎన్నో విజయాలు సాధించారు.

 New Book By Us-based Indian Journalist Narrates Rise Of ‘phenomenal’ Kamala-TeluguStop.com

రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో కీలక పదవులను పొందడంతో పాటు తమకు ఆశ్రయం కల్పించిన అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇక ఇన్నేళ్లలో భారతీయులు సాధించినది ఒక ఎత్తైతే.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక ప్రవాస చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం.అమెరికా చట్ట సభల్లో శాసనకర్తలుగా, స్థానిక ప్రభుత్వాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు ఏకంగా దేశంలోనే రెండో శక్తివంతమైన పదవిని పొందడం నిజంగా ఒక కొత్త శకానికి ఆరంభం.

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి దక్షిణాసియా వాసిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

కమలా హారిస్ ఎన్నిక, అగ్రరాజ్యంలో ప్రవాస భారతీయుల వృద్ధి వంటి అంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు అక్కడి భారతీయ అమెరికన్ సమాజం, స్కాలర్స్, దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తల బృందం నడుం బిగించింది.

దీనిలో భాగంగా ఈ ఏడాది జూలైలో ‘‘ కమలా హారిస్ అండ్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ ’’ అనే పేరిట సంకలనాన్ని రచించారు.ఇదే కోవలో భారత సంతతికి చెందిన జర్నలిస్ట్, రచయిత చిదానంద్ రాజ్‌ఘట్టా .కమలా హారిస్‌పై మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు.“Kamala Harris: Phenomenal Woman” పేరిట రచించిన ఈ పుస్తకాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.

Telugu Iyer, Kamala Harris, Kamalaharris, Phenomenal-Telugu NRI

చిదానంద్ ఇందులో బయటి ప్రపంచానికి తెలియని కమలా హారిస్ వివరాలను పంచుకున్నారు.ఉదాహరణకు ఆమె బర్త్ సర్టిఫికెట్‌లోని పేరు మధ్యలో ‘‘అయ్యర్’’ అని వుండేదని, తర్వాత దీనిని ‘‘దేవి’’గా మార్చారని తెలిపారు.అలాగే బర్కిలీలో గడిచిన కమలా హారిస్ బాల్యాన్ని గురించి కూడా చిదానంద్ ప్రస్తావించారు.కమల పసిబిడ్డగా వున్నప్పుడు ఆమె తండ్రి డోనాల్డ్.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఫెలోషిప్ కోసం యత్నించినట్లు రాశారు.300 పేజీలకు పైగా సాగే ఈ పుస్తకంలో ఓటు హక్కు ఉద్యమం, రాజకీయ ప్రాతినిథ్యం, మహిళలు ఎదుర్కొంటున్న అడ్డంకులను కూడా ఆయన ప్రస్తావించారు.ఈ పుస్తకానికి హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణకర్తగా వ్యవహరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube