బాలయ్య వాచ్ మ్యాన్ ను చంపింది ఎవరు.. కాల్పులు ఎందుకు.. వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్?

గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేడెక్కాయి.పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయాలు నేడు పట్టాభి అరెస్టుతో మరింత సంచలనంగా మారాయి.

 Mla Vallabhaneni Vamsi Sensational Comments On Pawan Kalyan Over Balakrishna Gun-TeluguStop.com

ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో పచ్చి బూతులు తిట్టుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత దుమారం రేపుతున్నాయి.ఇక టిడిపి నేత పట్టాభి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా అతనిని అరెస్ట్ చేయడం వైసిపి కార్యకర్తలు నేతలు టిడిపి ఆఫీసుల పై దాడి చేయడం, తిరిగి దీనికి నిరసనగా టిడిపి నేతలు దీక్ష ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే పలువురు వైసీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుకు అనుచరుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేస్తూ అతని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టిడిపి ఆఫీసులపై వైసీపీ నేతలు దాడి చేయడం సరికాదని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు నేతలు పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీ కి వెళ్ళిన తర్వాత ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Balakrishna, Pawan Kalyan, Sensational-Movie

ఆయన ఎంతో గొప్ప మేధావి.ఈ ప్రపంచంలో ఆయనకు తెలియనిదంటూ ఏదీ లేదు.ఆయన ఇప్పటి వరకు రెండు లక్షల పుస్తకాలను చదివిన మేధావి.

అలాంటి మేధావికి ప్రతి ప్రశ్నకు జవాబు తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివినా వ్యక్తి కనుక అతనికి అన్నీ తెలిసి ఉంటాయి అంటూ వంశీ మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథ రామయ్య ఎలా మృతి చెందాడో పవన్ కళ్యాణ్ ఎంక్వయిరీ చేయవచ్చు.ఎన్టీఆర్ పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ అనే వ్యక్తి ఎలా మృతి చెందాడు కూడా ఆయనను ప్రశ్నించవచ్చు.

అలాగే నందమూరి బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిపారు బాలకృష్ణ వాచ్ మెన్ ను చంపింది ఎవరు అనే విషయాలను గురించి కూడా పవన్ కళ్యాణ్ ని అడిగి తెలుసుకోవచ్చు.ఎందుకంటే ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివిన మేధావి కనుక అతనికి అన్నీ తెలిసి ఉంటాయని వల్లభనేని వంశీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube