పవన్ 'గోపాల గోపాల' సీక్వెల్‌ రాబోతుందా!

పవన్ కళ్యాణ్‌ నటించిన మొదటి మల్టీ స్టారర్ మూవీ గోపాల గోపాల అనే విషయం తెల్సిందే.ఆ సినిమా లో పవన్ కళ్యాన్‌ దేవుడిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

 Pawan Kalyan Gopala Gopala Movie News Details, Gopala Gopala, Movie News, Pawan,-TeluguStop.com

మొదటి నుండి పవన్‌ కళ్యాణ్‌ ను అలాంటి పాత్రల్లో చూడాలనుకున్న అభిమానులు ఫిదా అయ్యారు.సినిమా కమర్షియల్‌ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

యావరేజ్ టాక్‌ దక్కించుకున్నా కూడా భారీగా వసూళ్లు నమోదు అయిన నేపథ్యంలో మరోసారి ఆ కాంబో కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.గోపాల గోపాల సినిమా హిందీ లో వచ్చిన ఓమై గాడ్‌ సినిమా కు రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఇప్పుడు ఓమై గాడ్‌ సినిమా కు సీక్వెల్‌ రాబోతుంది.కనుక సీక్వెల్‌ కు కూడా రీమేక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

ఓమై గాడ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా పవన్ దృష్టిని ఆకర్సించడం ఖాయం.అయితే తెలుగు లో పవన్‌ కళ్యాణ్ వరుసగా సినిమా లు చేస్తున్నాడు.

వచ్చే ఏడాది లో రాబోతున్న ఆయన సినిమా ల జాబిత చాలా పెద్దగానే ఉంది.ఆయన రాబోయే ఎన్నికల వరకు సాధ్యం అయినన్ని సినిమా లు చేయాలని భావిస్తున్నాడు.

అలా వచ్చిన డబ్బుతో పార్టీని నడిపించాలని భావిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ ఎన్నికల కు వెళ్లక ముందే గోపాల గోపాల సినిమా సీక్వెల్‌ చేస్తే బాగుంటుంది.

Telugu Bheemla Nayak, Gopala Gopala, Gopalagopala, Hrihara, God, Pawan, Ram Char

మరి అప్పటి వరకు ఓమై గాడ్‌ సినిమా వస్తుందా అనేది చూడాలి.ఒక వేళ ఓమై గాడ్‌ కనుక పవన్ కళ్యాన్ చేయలేక పోతే ఖచ్చితంగా రామ్‌ చరణ్ ఆ సినిమా ను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది.అసలు పవన్‌ కు సీక్వెల్‌ చేసే ఆసక్తి ఉంటుందా అనే విషయాలను తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.పవన్‌ ప్రస్తుతం భీమ్లా నాయక్‌.హరి హర వీరమల్లు సినిమాల తో పాటు భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమా లను చేస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube