అవకాశాల కోసం ఇంట్లో వంట పని చేశా.. జబర్దస్త్ చమ్మక్ చంద్ర కన్నీటి కష్టాలు?

నిజాంబాద్ జిల్లా బాన్సువాడలోని ఒక చిన్న తండా నుంచి వచ్చి ప్రస్తుతం బుల్లితెరపై హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు చమ్మక్ చంద్ర.జబర్దస్త్ ద్వారా ఫేమ్ సాధించి ఇప్పుడు పలు చిత్రాల్లో కూడా నటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

 Jabardasth Chammak Chandra Most Emotional Comments About His Life Struggle,  Cha-TeluguStop.com

ఇవన్నీ ఆయనకు ఊరికే రాలేదు.ఆయన కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలకు ఎదురు నిల్చి ఈ స్థాయికి వచ్చిన వారే.

చిన్నప్పుడు పోస్టర్లపై బాబు మోహన్, బ్రహ్మానందం ఈ పోస్టర్లు కనిపించగానే ఆ సినిమాకు వెళ్లిపోయే వాడిని వారి నటన బాగా నచ్చుతుందని చమ్మక్ చంద్ర వివరించారు.చిన్నప్పటినుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేదని తెలిపారు.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అంటే, ఆయన డ్యాన్స్ అంటే తనకు చాలా పిచ్చి అని, ఆ అభిమానమే ఆయనను ఇక్కడికి తీసుకు వచ్చిందని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.

తన చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని చమ్మక్ చంద్ర వివరించారు.

పదవ తరగతిలో ఫెయిల్ అయిన తాను సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇక్కడికి వచ్చాను.

Telugu Babumohaan, Brahmanandam, Chammak Chandra, Chammakchandra, Chiranjeevi, S

ఆ తర్వాత రెండు సంవత్సరాలు ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నటనపై తీసుకున్నాను.అక్కడే ధనరాజ్ కూడా పరిచయం అయ్యారని ఆయన చెప్పారు.అనంతరం ఎక్కడికి వెళ్లాలో తెలియక ఫ్రెండ్స్ దగ్గరే కాలం వెళ్లదీసానని ఆయన తెలిపారు.

పక్కనే ఆర్టిస్ట్ విజయ్ ఉండేవారని, ఆయన్ని పరిచయం చేసుకొని, ఆయనకు వంట చేస్తూ ఇండస్ట్రీ గురించి కొంచెం తెలుసుకున్నానని చమ్మక్ చంద్ర అన్నారు ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఒక రూమ్ తీసుకుని చిన్న చిన్న డాన్స్ క్లాసెస్ జీవితం గడిపానని ఆయన అన్నారు.

Telugu Babumohaan, Brahmanandam, Chammak Chandra, Chammakchandra, Chiranjeevi, S

ఆ తర్వాత కూడా చాలా పెయిన్ అనుభవించాను అని చమ్మక్ చంద్ర అన్నారు.ఒకానొక సందర్భంలో తన దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలకి రెండు కిలోల బియ్యం వచ్చేవని, దాన్ని కాదని నూకలను కొనుగోలు చేసే వాడినని, ఎందుకంటే నూకలైతే రెండు కిలోలు వస్తాయి బియ్యమైతే నాలుగు కిలోలు వస్తాయి అని ఆయన వివరించారు.కొన్నిసార్లు తన ఇంటికి వెళ్లడానికి కూడా ఆలోచించే వాడిని ఎందుకంటే అక్కడికి వెళ్తే ఊర్లో వాళ్లంతా ఏం చేస్తున్నావ్ అని అడగడం భరించలేక వెళ్లడం కూడా కొన్ని రోజులు మానుకున్నానని ఆయన చెప్పారు.

Telugu Babumohaan, Brahmanandam, Chammak Chandra, Chammakchandra, Chiranjeevi, S

అప్పట్లోలో వాళ్ళ ఫ్యామిలీకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉండేదని తన తల్లిదండ్రులు కట్టెలు కొట్టి బర్రె పాలు పితికి ఆ వచ్చిన డబ్బుతో బియ్యం కొనుక్కొచ్చే వారని ఆయన ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.తన ఇంట్లో చాలా సంవత్సరాలు కిరోసిన్ దీపం కిందనే గడిచినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.ఇక్కడికి వచ్చాక కూడా అవకాశాలేమీ అంత తొందరగా రాలేదని, అవకాశాల కోసం కొందరి సెలబ్రిటీల ఇంటిలో వంట పని కూడా చేశానని తెలిపారు.తనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోవడం కూడా చాలా పెద్ద మైనస్ అయ్యిందని అని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube