మితిమీరిన ప్రాంక్‌.. చివ‌ర‌కు ప్రాణాలు పోగొట్టుకుంది..

సోష‌ల్ మీడియా విస్త‌రించిన‌ప్ప‌టి నుంచి మితిమీరిన ట్రెండ్ బాగా పాపుల‌ర్ అయిపోతుంది.ఇప్ప‌టికే చాలా ర‌కాల ట్రెండ్స్ మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

 Excessive Prank .. Finally Lost Lives . Prank Video, Viral News, Killed , Gun ,-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా ఇందులో కొన్ని ప్రాణాల‌ను కూడా తీసేవిధంగా ఉంటున్నాయి.కొన్ని ట్రెండ్స్ అనేవి స‌మాజాన్ని చైత‌న్య‌ప‌రిచే విధంగా ఉంటే మ‌రి కొన్ని మాత్రం స‌మాజాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంటున్నాయి.

ఇందులో ప్రాంక్ వీడియోలు కూడా ఉంటున్నాయి.ప్రాంక్ వీడియోలు ఎంత‌లా పాపుల‌ర్ అవుతున్నాయో అంత‌లా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాయి.

అయితే ఇవి ఎంత‌లో ఉండాలో అంత‌లో ఉంటే బాగానే ఉంటుంది.కానీ మితిమీరితేనే చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు వ‌స్తుంది.ఇక ఇప్పుడు కూడా ఓ యువ‌తి ఇలాంటి ప్రాంక్ వీడియో చేయ‌బోయి చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది.దాన్ని చూసిన వారంతా ఇదంతా అవ‌స‌ర‌మా అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే వివ‌రాల్లోకి వెళ్తే మెక్సికోలోని నౌక్‌చాట్ డి జుయారజ్‌లో ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.అయితే ఈ ప్రాంతంలో నివ‌సించే మ‌హిళ దెయ్యం లాగా వేశం వేసి ప్రాంక్ వీడియో చేయాల‌నుకుంది.

ఇందుకోసం తెల్ల‌టి బ‌ట్ట‌లు వేసుకుంది.

Telugu Nouakchottde, Devil, Mexico, Prank-Latest News - Telugu

ఈ వేశంతో ఆమె వీధుల్లోకి వ‌చ్చి వ‌చ్చిపోయే వారిని భ‌య‌పెట్టాల‌నుకుంది.ఇలా చాలామందిని భ‌య‌పెట్టింది.ఆమె వ‌య‌సు కూడా 20 నుంచి 25 మ‌ధ్య‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

లా లొరోనా అనే భయానక పాత్ర కు సంబంధించిన వేశం ఆమె వేసుకుంది.ఇలా వేశం వేసుకుని ఎదురొచ్చిన వారంద‌రినీ త‌న బిడ్డ‌లు అంటూ పెద్ద‌గా అరుస్తూ భ‌య‌పెట్టేసింద‌తి.

ఇంకేముంది ఆమెను చూసిన వారంతా కూడా హ‌డ‌లెత్తిపోయారు.కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఇలా భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్ తీసుకుని కాల్పులు జ‌ర‌ప‌గా అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube