ఎట్టకేలకు నీరా టాండన్‌కు న్యాయం చేసిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో కీలక పదవి

భారత సంతతి పాలసీ మేకర్ నీరా టాండన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు న్యాయం చేశారు.ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించారు.

 Indian-american Policy Expert Neera Tanden Named White House Staff Secretary , W-TeluguStop.com

ఈ మేరకు శుక్రవారం శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది.వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీ వింగ్‌లో అది కీలకమైన పదవి.

పరిపాలనా యంత్రాంగంతో పాటు ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి వచ్చే పత్రాలను ఈ విభాగం నిర్వహిస్తుంది.కొత్తగా బాధ్యతలు స్వీకరించినా… నీరా టాండన్ ‌అధ్యక్షుడి సలహాదారు పదవిలోనే కొనసాగుతారని శ్వేతసౌధం తెలిపింది.

ఆమె విధి నిర్వహణలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్‌కు రిపోర్ట్ చేస్తారు.తాజా నియామకానికి సంబంధించి నీరా టాండన్‌కు సెనేట్ ఆమోదం అవసరం లేదు.

కాగా.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదుల సంఖ్యలో భారతీయులకు విజయవంతంగా పదవులు కట్టబెట్టిన జో బైడెన్‌కు ఒక్క నీరా టాండన్ విషయంలోనే ఎదురుదెబ్బ తగిలింది.భారత మూలాలున్న నీరాను ఎనిమిది నెలల క్రితం వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా ఆమెను బైడెన్‌ నామినేట్ చేశారు.అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్‌, రిపబ్లిక్ నేతలను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.

ఇవే ఆమె కొంప ముంచాయి.దీంతో నీరా నియామకాన్ని కేబినెట్‌ మంత్రులు, డెమొక్రాటిక్‌, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు.

గతంలో ఆమె చేసిన ‘పక్షపాత’ వ్యాఖ్యల విషయమై డెమొక్రాట్ సెనేటర్ జో మాంచిన్ .తాను నీరాకు మద్దతుగా ఓటు వేయబోనని తేల్చి చెప్పారు.మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్ నామినేషన్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాంచిన్ స్పష్టం చేశారు.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల నాయకులపై ఆమె గతంలో చేసిన దురుసు వ్యాఖ్యల చరిత్రను ఈ సందర్భంగా మాంచిన్ గుర్తు చేశారు.

ఈ ధోరణి ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నీరా టాండన్ పక్షపాత ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకు, బడ్జెట్ కార్యాలయం , డైరెక్టర్ పని సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు.

Telugu Democratjoe, White Budget, Indianamerican, Joe Biden, Nira Tandon, Whites

ఇదే సమయంలో బడ్జెట్‌ చీఫ్‌గా ఆమె నియామకంపై మద్దతు కూడగట్టడంలో బైడెన్ కేబినెట్‌ విఫలమైంది.నీరా టాండన్‌ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్‌లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్‌ వెనక్కి తగ్గారు.గత్యంతరం లేని పరిస్దితుల్లో నీరా టాండన్‌ వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ (ఓఎంబీ) డైరెక్టర్‌ పదవికి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టుగా మార్చిలో అధ్యక్షుడికి లేఖ రాశారు.తన నియామకాన్ని ధ్రువీకరించేందుకు అధ్యక్ష కార్యాలయం, భారతీయ సమాజం ఎంతో కష్టపడ్డారని.

కానీ పరిస్ధితులు మాత్రం తనకు అనుకూలంగా లేవని నీరా టాండన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తన నామినేషన్‌ను విత్ డ్రా చేయాలని నీరా కోరడంతో తాను అంగీకరించానని బైడెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఆమె అనుభవం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యంపై తనకెంతో గౌరవం ఉందని, త్వరలోనే టాండన్ మరో కీలకమైన పదవిలోకి వస్తారని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం… రెండు నెలలు తిరిగే సరికి నీరాకు కీలక బాధ్యతలు అప్పగించారు బైడెన్.

అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ ఈ ఏడాది మే నెలలో బైడెన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube