' కారు ' ని టెన్షన్ పెడుతున్న రోలర్ ? 

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గం లోకి వచ్చేసరికి అక్కడ మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు గట్టు పట్టు ఉంది.ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతోపాటు,  వరుసగా గెలుస్తూ వస్తుండడం ఇవన్నీ ప్రస్తుత హుజురాబాద్ ఉప ఎన్నికలలో రాజేంద్ర కు కలిసి వస్తున్నాయి.

 Trs Tention On Chapathi Roller On Election Symbo Trs, Election Symbol, Trs Gover-TeluguStop.com

దీంతో టీఆర్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎంతగానో ప్రయాస పడుతోంది.ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందర్నీ రంగంలోకి దించారు.

అయినా టిఆర్ఎస్ కి ఇప్పుడో కొత్త భయం మొదలైంది.

        ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి దక్కిన రొట్టెల పీట ( చపాతీ రోలర్ ) టిఆర్ఎస్ ను భయపెడుతోంది.2018 ఇది సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు చాలా చోట్ల ఓటమి చెందడానికి ఈ గుర్తు కారణం అయ్యింది.అలాగే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ చపాతీ రోలర్ గుర్తు కారణంగా టిఆర్ఎస్ ఓటమి చెందింది అనే అంచనాలో టిఆర్ఎస్ పార్టీ ఉంది.

ఇప్పుడు ఈ ఎన్నికల గుర్తు తమకు ఎంతవరకు డ్యామేజ్ కలిగిస్తుందనేది తెలియక టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి  ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలలో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్ధి సిలివేరు శ్రీకాంత్ పోటీలో ఉన్నారు.ఆయనకే చపాతి రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
   

Telugu Car Symbol, Chapathi Roller, Symbol, Etela Rajender, Hujurabad, Trs-Telug

     బ్యాలెట్ పేపర్ లో గుర్తు కారును పోలి చపాతీ రోలర్ ఉండటంతో , గతంలో ఎదురైన ఓటమి ని టిఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.హుజురాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్,  కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ ల కంటే ఈ చపాతి రోలర్ గుర్తు విషయంలోని టిఆర్ఎస్ ఎక్కువ ఆందోళన చెందుతోంది.గతంలోనే చపాతి రోలర్ గుర్తు తో పాటు , మరికొన్ని గుర్తులపై కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.అప్పట్లో కొన్ని గుర్తులు విషయంలో ఎన్నికల సంఘం టిఆర్ఎస్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, చపాతీ రోలర్ ను మాత్రం తొలగించలేదు.

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో,  చపాతి రోలర్ ఎంత చేటు చేస్తుంది అనే విషయం పైనే కారు పార్టీ ఇంతగా టెన్షన్ పడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube