పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు... వ్యూహంలో భాగమేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక ఇతర దేశాలలో నివసిస్తున్న తెలుగు వారు కూడా హుజూరాబాద్ లో ఎవరిది పై చేయి అవుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.

 Bullets Of Words Exploding Between The Parties In Huzurabad Details, Huzurabad B-TeluguStop.com

అయితే ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీల కీలక నేతలు హుజూరాబాద్ ప్రచారంలో కీలకంగా పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

ఎన్నికల హీట్ ను పెంచడానికి మాటల తూటాలకు ఒక పార్టీ మరో పార్టీపై మాటల తూటాలతో విరుచుక పడుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహంలో భాగంగానే పదునైన విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పై చర్చ జరగవద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ , టీఆర్ఎస్ కుమ్మక్కై ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.

కానీ అసలు వాస్తవం ఏంటని ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం హుజురాబాద్ లో బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది.

Telugu Balmur Venkat, Bjp, Huzurabad, Congress, Etela Rajender, Huzurabadtrs, Tr

ప్రజల్లో కూడా ఈటెల రాజేందర్, కెసీఆర్ కు మధ్య పోరు నడుస్తున్నదని  ప్రజల్లో మంచి క్లారిటీ ఉన్న పరిస్థితి ఉంది.ప్రజలు కాంగ్రెస్ ను టీఆర్ఎస్ కు పోటీ పార్టీ అని భావించనప్పుడు సాధారణంగానే ఇతర పార్టీలు కూడా చర్చించడం మానేస్తాయి.పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ప్రచారం చేస్తున్నా ఇతర పార్టీలతో సమానంగా కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి రాలేకపోతోంది.మరి రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు జరుగుతాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube