ఇన్స్టాగ్రామ్ లో అదిరిపోయే సరికొత్త ఫీచర్లు..!

స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరు మొబైల్ లో ఉండే యాప్ లలోఇంస్టాగ్రామ్ ఒకటి.ఫేస్బుక్ , ట్విట్టర్, షేర్ చాట్, స్నాప్ చాట్ ఎలాగో ఇంస్టాగ్రామ్ కూడా అలాగే వినియోగదారులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

అయితే అన్ని యాప్ లలో కన్న ఇంస్టాగ్రామ్ అత్యంత ప్రజాధారణ కలిగింది.ఇందులో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడమే కాకుండా రీల్స్ కూడా చేయొచ్చు.

అయితే ఇంస్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన సరికొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది.ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాతనే ఇంస్టాగ్రామ్ ప్లీజ్ అన్న ఫీచర్ ను ఇంస్టాగ్రామ్ లీడర్లకు పరిచయం చేసింది.

అంతేకాదు ఈ ఫీచర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా రీల్స్ లో మ్యూజిక్ ఎడిట్ చేయడానికి వీలుగా మూడు కొత్త ఎఫెక్ట్స్ ను తీసుకొచ్చింది.

అవేంటంటే సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, త్రీడీ లిరిక్స్.ఈ ఎఫెక్ట్స్ మ్యూజిక్ ఆధారంగా స్క్రీన్ పై లిరిక్స్ అందించడం, అలాగే ఆటోమేటిక్ గా ఎడిట్ చేయడానికి ఉపయోగపడతాయి.

సూపర్ బీట్ , డైనమిక్ లిరిక్స్క్స్, త్రీడి లిరిక్స్ కొత్త వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ మూడు కొత్త ఫీచర్లు వినియోగదారులకు మ్యూజిక్ ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఆకర్షణీయమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది.

Telugu Ups, Reels-Latest News - Telugu

సూపర్ బీట్, డైనమిక్ లిరిక్స్, త్రీడీ లిరిక్స్ అనే ఈ మూడు కొత్త ఎఫెక్ట్ లలో వినియోగదారులు రీల్స్ చేసేటప్పుడు మ్యూజిక్, ఏఆర్ ఎఫెక్ట్స్ సులువైన మార్గాలను ఇస్తాయి.ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ బీట్ గురించి.సూపర్ బీట్ అనేది ఇది ఒక కొత్త మ్యూజిక్ బీట్ ఎఫెక్ట్.దీంతో యూజర్ ఎంచుకున్న పాట ఆధారంగా వారి రీల్ కు ఆకర్షణీయమైన విజువల్ ఎడిట్ లను ఆటోమేటిక్ గా అప్లై చేస్తుంది.

మరో రెండు డైనమిక్ అండ్ 3D లిరికల్ ఎఫెక్ట్స్.ఇవి రీల్ పాటల లిరిక్స్ ను అందించడం ద్వారా యూజర్ మ్యూజిక్ కి అనుగుణంగా పర్ఫామెన్స్ చేయగలరు.

Telugu Ups, Reels-Latest News - Telugu

ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించేందుకు ముందుగారీల్స్ కెమెరా ని ఓపెన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎఫెక్ట్ లేదా గ్యాలరీ ని ఓపెన్ చేసుకోవాలి.ఇప్పుడు మీకు స్టేట్ సూపర్ బీట్ డైనమిక్ లిరిక్స్ అనే ఎఫెక్ట్ లలో కనిపిస్తాయి.అయితే ఈ యాప్ లో ఒకేసారి రెండు ఎఫెక్ట్ లను మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది.త్వరలో ఇంస్టాగ్రామ్ డైనమిక్ బదులుగా త్రీడి లిరిక్స్ ను కూడా అందిస్తుంది.

సూపర్ బీట్ లేదా డైనమిక్ లిరిక్స్ లేదా త్రీడి లిరిక్స్ లలో ఒక ఎఫెక్ట్ ను ఉంచుకోవాలి.అలాగే సెలెక్ట్ చేసుకోవడానికి మ్యూజిక్ పికర్ ను ఎంచుకోవాలి.

ఇప్పుడు రికార్డింగ్ ప్రారంభించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube