చివరి అంకానికి చేరిన హుజురాబాద్ ఉప ఎన్నిక...

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఇక మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముమ్మరం చేసాయి.

 Huzurabad By-election Reaches Fina Huzurabad By Elections, Telangana Politics-TeluguStop.com

ఇక గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ వ్యూహ, ప్రతి వ్యూహాలను పన్నుతూ ముందుకెళ్తున్నా పరిస్థితి ఉంది.ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కీలకనేతలు హుజూరాబాద్ లో మకాం వేసిన పరిస్థితి ఉండగా, బీజేపీ కీలక నేతలు కూడా హుజూరాబాద్ లో పర్యటిస్తూ బీజేపీ విజయావకాశాలను పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే  ఉప ఎన్నిక చివరి అంకానికి చేరడంతో  ఇక పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రజలు ఎవరికి మద్దతిస్తున్నారో ఇప్పటికీ ఎవరికి క్లారిటీ రాకపోవడంతో సైలెంట్ ఓటింగ్  పెద్ద ఎత్తున జరిగే అవకాశం కనిపిస్తోంది.

కావున పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ తమకు అనుకూలంగా ఉన్న వర్గాల ఓట్లు తమ పార్టీకే లభించే విధంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఏ పార్టీఅయినా ఎలక్షనీరింగ్ సరిగ్గా చేస్తేనే విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ప్రచార సమయంలో ఎంతగా ప్రచారం చేసినా కీలక సమయంలో ప్రజలను తమ పార్టీవైపు తిప్పుకోవడంలో విఫలమైతే అప్పటివరకు చేసిన ప్రచారం అంతా నిరుపయోగమైనట్టే.ఇప్పటికే టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @ktrtrs, Huzurabad-Political

తాజాగా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రజలు ఎవరి పట్ల అనుకూలంగా ఉన్నారనే విషయంపై రకరకాల సర్వేలు వెలుగులోకి వచ్చినా ప్రజల ఖచ్చితమైన అభిప్రాయం తెలిసేది ఎన్నికల ఫలితాల తర్వాతే.ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక చివరి అంకానికి చేరడంతో ఏ పార్టీ విజయం సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube