బిగ్ బాస్ విన్నర్ అతనే.. శ్వేత వర్మ షాకింగ్ కామెంట్స్?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమై ఆరు వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుని ఆరుగురు కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.అయితే ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులలో ప్రేక్షకులు ఉన్నారు.

 Bigg Boss Telugu 5 Swetha Varma Predictions About Bigg Boss Winner, Bigg Boss ,-TeluguStop.com

ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఉండడంతో ఈ కార్యక్రమంపై ప్రేక్షకులు ఎలాంటి ఉత్సాహం చూపించలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆరో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ శ్వేతవర్మ ఎలిమినేట్ అయ్యారు.

అయితే శ్వేత వర్మ ఎలిమినేట్ కావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఆరు వారాల పాటు ప్రేక్షకులకు సందడి చేసిన శ్వేతా వర్మ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పలు ఇంటర్వ్యూలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేది ఎవరో తెలియజేశారు.

Telugu Bigg Boss, Swetha Varma-Movie

ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో సన్నీ ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, అతనే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటారనీ శ్వేతా వర్మ తెలియజేశారు.అదేవిధంగా టాప్ 3 కంటెస్టెంట్ గా సన్నీతో పాటు మానస్‌, యానీ మాస్టర్‌ టాప్ త్రీ పొజిషన్లో ఉంటారని ఈ సందర్భంగా శ్వేత వర్మ తెలియజేశారు.మరి శ్వేతా వర్మ జోస్యం నిజం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube