ఎన్టీఆర్‌, కొరటాల మూవీ ఆలస్యంకు కారణం ఇదేనా?

రామ్ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లు కలిసి జక్కన్న సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్ లో గత మూడు ఏళ్లుగా చేస్తున్నారు.ఆ సినిమా కారణంగా ఇతర సినిమాలు ఏమీ కూడా ఇద్దరు హీరోలు మూడు ఏళ్లుగా చేయలేదు.

 Ntr And Koratala Shiva Movie Shooting Starting Update ,ntr And Koratala , New M-TeluguStop.com

చరణ్‌ మద్యలో కొన్ని రోజులు ఆచార్యలో గెస్ట్ రోల్‌ గా చేశాడు.కాని ఎన్టీఆర్‌ మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త సినిమా ను మొదలు పెట్టిందే లేదు.

గత ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్‌ 30 వ సినిమా ను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ సినిమాకు సంబంధించినంత వరకు ఏం జరిగిందో ఏమో కాని ప్రారంభం కాకుండానే పక్కకు తప్పింది.

త్రివిక్రమ్‌ తప్పుకోవడంతో కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్దం అవ్వడం.అధికారిక ప్రకటన రావడం జరిగి పోయింది.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివల కాంబోలో రూపొందాల్సిన సినిమాను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులోనే పట్టాలెక్కించే అవకాశం ఉందన్నారు.కాని ఈ ఏడాది ముగింపు దశకు వచ్చాం.

ఇప్పటికి కూడా ఎన్టీఆర్ 30 సినిమా పట్టాలు ఎక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు.పెద్ద మొత్తంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్న యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు అసలు సినిమా కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.br>

Telugu Koratala Shiva, Ntr, Rrr, Tollywood-Movie

దాంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సినిమా విషయమై క్లారిటీ వచ్చింది.ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ కోసం బరువు పెరిగాడు.కొరటాల శివ సినిమా కోసం 10 కేజీల వరకు బరువు తగ్గాలని భావిస్తున్నాడట.అందుకే ఈ గ్యాప్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇదే కనుక నిజం అయితే డిసెంబర్‌ నుండి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఆచార్య పని ముగించుకున్న కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్‌ 30 సినిమా కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube