ఆ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న కమల్.. మన చరిత్ర అని చెబుతూ?

సినిమా నటుడిగా తెలుగు, తమిళంతో పాటు అన్ని భాషలలో కమల్ హాసన్ కు భారీస్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.కమల్ హాసన్ వయస్సు ప్రస్తుతం 66 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 Star Hero Kamal Hassan Entry Into Fashion Business Details, Cheneta People, Chic-TeluguStop.com

ఒకప్పుడు తనకు రాజకీయాలు సరిపడవని కమల్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే తర్వాత కాలంలో కమల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే ఎన్నికల్లో కమల్ హాసన్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదు.రాజకీయాలలో ఎదురుదెబ్బలు తగలడంతో కమల్ సినిమాలపై దృష్టి పెట్టారు.మరోవైపు కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ సినిమాలో నటించడంతో పాటు ఇండియన్2 సినిమా ద్వారా మళ్లీ బిజీ కావాలని కమల్ హాసన్ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

అయితే ఆరు పదుల వయస్సులో ఈ స్టార్ హీరో వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Telugu Cheneta, Chikago, Khaddar, Kamal Haasan, Kamal Hassan, Kamal-Movie

ఆర్థికంగా బలంగా లేని చేనేత కార్మికులకు అండగా నిలబడాలని కమల్ హాసన్ ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.హౌస్ ఆఫ్ ఖద్దర్ పేరుతో కమల్ హాసన్ కొత్త బ్రాండ్ ను మార్కెట్ లోకి తీసుకొనిరానున్నారు.అదే బ్రాండ్ నేమ్ తో చేతితో నేసిన బట్టలను, ఇతర వస్తువులను ప్రజలకు కమల్ హాసన్ అందించనున్నారు.

Telugu Cheneta, Chikago, Khaddar, Kamal Haasan, Kamal Hassan, Kamal-Movie

అయితే ఈ బ్రాండ్ కు సంబంధించిన దుకాణాలను కమల్ హాసన్ మొదట విదేశాల్లో మొదలుపెట్టనున్నారు.చికాగోలో మొదట దుకాణం ప్రారంభం కానుండగా యువతకు ఖాదీని చేర్చడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ ను ప్రవేశపెడుతున్నామని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.కమల్ హాసన్ వ్యాపారం విషయంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube