బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్‌పై కసరత్తు తీవ్రతరం: బైడెన్‌ను కలిసిన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు

బిల్డ్ బ్యాక్ బెటర్ క్యాంపెయిన్‌ ప్రోగ్రెసివ్ అజెండా గురించి చర్చించడానికి భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నాతో సహా కొంతమంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు.ఈ ఎజెండాలో సామాజిక భద్రత వలయంలో మార్పులు, వాతావరణం, విద్యలో పెట్టుబడులు వంటి అంశాలు వున్నాయి.

 Indian American Lawmakers Meet Biden To Discuss Build Back Better Plan, Build Ba-TeluguStop.com

బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్‌లో ఉద్యోగాలను సృష్టించడం, పన్నులు తగ్గించడం, కార్మిక కుటుంబాల కోసం వ్యయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రోగ్రాసివ్ కాకస్ అధిపతిగా వున్న ప్రమీలా జయపాల్ మీడియాతో మాట్లాడుతూ.

అభ్యుదయవాదులు తమ డిమాండ్లను ఐదు ప్రాధాన్యతలతో నెరవేర్చారని చెప్పారు.ఈ ఎజెండా విజయవంతం కావడానికి చర్చల ప్రాముఖ్యతను ప్రమీలా జయపాల్ పునరుద్ఘాటించారు.

ఈ పనిని పూర్తి చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు.కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ డిప్యూటీ విప్ రో ఖన్నా మాట్లాడుతూ.

ప్రెసిడెంట్ క్లైమేట్ యాక్షన్, చైల్డ్ టాక్స్ క్రెడిట్ వంటి ప్రగతిశీల ఎజెండాల కోసం బిల్లులో ప్రతిపాదిస్తామని తెలిపారు.ప్రస్తుతం మిలియన్ల మంది అమెరికన్ల శ్రేయస్సు ప్రమాదంలో వుందని రో ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు.

మల్టీ ట్రిలియన్ డాలర్ స్పెండింగ్ బిల్‌పై చర్చల నేపథ్యంలో ప్రమీలా జయపాల్ గత సోమవారం రిపబ్లికన్ సెనేటర్ జో మన్‌చిన్‌ను కలిసిన సంగతి తెలిసిందే.

Telugu Build, Indianamerican, Joe Biden, American Rescue, Package-Telugu NRI

కాగా, 2017 నుంచి వాషింగ్టన్ 7వ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్ ఈ ఏడాది జనవరిలో బడ్జెట్ ఆమోదంలో కీలకపాత్ర పోషిస్తున్న హౌస్ బడ్జెట్ కమిటికీ సభ్యురాలిగా ఎంపికయ్యారు.అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా జయపాల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.దేశంలోని కార్మికులు తమ శ్రమకు ప్రతిఫలంగా గంటకు 15 డాలర్లను కనీస వేతనంగా అందుకోవాలనే ఉద్దేశ్యంతో జయపాల్ పనిచేస్తున్నారు.

Telugu Build, Indianamerican, Joe Biden, American Rescue, Package-Telugu NRI

మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.‘ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు ఇటీవల సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి.దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.

ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ ఇప్పటికే తెలిపారు.దీనికి అదనంగా మరో 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్‌ను సైతం జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది.వీటి అమలుకు సంబంధించిన అజెండా రూపకల్పనలోనే ప్రస్తుతం డెమొక్రాట్లు బిజీగా వున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube