అరుదైన గౌరవం సొంతం చేసుకున్న సింగర్ చిత్ర ..!

దక్షిణ భారత నైటింగేల్ గా ప్రసిద్ధిగాంచిన లెజెండరీ సింగర్ కె.ఎస్ చిత్ర గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.

 Singer Film With Rare Respect Singer Chitra,rare Record, Latest News, Uae, Golde-TeluguStop.com

భారతీయ సినీ రంగం ప్రపంచంలో అమృతం నింపుకున్న తన గొంతుతో, గానంతో ఆమె ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఒరియా, హిందీ, అస్సాం బెంగాల్ వంటి అనేక భాషల్లో కొన్ని వేల పాటలు పాడి శ్రోతలను ఎంతగానో అలరించింది.

తాజాగా యూఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నట్లు చిత్ర స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్ ఈ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఫీడ్ చేశారు దీనికి సంబంధించిన ఫోటో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu Golden Visa, Kollywood, Latest, Rare, Chitra, Tollywood-Latest News - Tel

సంగీతకారులు కుటుంబంలో జన్మించిన చిత్ర కేరళలోని తిరువనంతపురంలో కృష్ణన్ నాయర్, శాంత కుమారి దంపతులకు 1963 లో జులై 27న జన్మించింది.చిత్ర అసలుపేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర.అయితే కె.ఎస్ చిత్ర గా ప్రసిద్ధి చెందింది.బాల్యంలో ఆమె తన తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది .మాతృభాష మలయాళంలో ఆమె గుర్తింపు పొందినా యావత్ దక్షిణాది పాటల ప్రేమికులను ఎంతగానో అలరించింది.1986లో వచ్చిన సింధుభైరవి అనే తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు.‘నఖ సెతంగాళ్’, హిందీ చిత్రం ‘విరాసత్‘ ద్వారా గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఆమె సాధించారు.మూడు దశాబ్దాల కాలంలో కొన్ని వేలకు పైగా పాటలు పాడిన ఆమె ఇప్పటివరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా, జాతీయ అవార్డులను అందుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube