భారీగా పెంచేసిన కీర్తి.. 'దసరా' సినిమాకు ఎంత తీసుకుంటుందంటే ?

కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ స్థాయి గుర్తింపు అవార్డు రావడం విశేషం.

 Keerthy Suresh Remuneration For Nani Dasara Movie, Bhola Shankar,dasara,keerthy-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది.

ప్రెసెంట్ కీర్తి ‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ పక్కన నటిస్తుంది.

Telugu Bhola Shankar, Dasara, Keerthy Suresh, Keerthysuresh, Sarkaruvaari-Movie

ఈ సినిమాను పరుశురాం డైరెక్టర్ చేస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుపు కుంటుంది.ఈ సినిమాలో కీర్తి గ్లామరస్ లుక్ లో కనిపించి ఆకట్టుకోబోతుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాదు చిరు భోళా శంకర్ సినిమాలో చిరు కి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

ఇక ఈ మధ్యనే ప్రకటించిన నాని ప్రకటించిన దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ నే హీరోయిన్ గా నటిస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు కీర్తి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Bhola Shankar, Dasara, Keerthy Suresh, Keerthysuresh, Sarkaruvaari-Movie

ఈ సినిమాకు కీర్తి 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు.శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక దసరా సినిమా టైటిల్ అనౌన్స్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసారు.ఇక ఈ పోస్టర్ లో నాని రింగుల జుట్టుతో, డీ గ్లామర్ గా చెవికి పోగు పెట్టుకుని రగ్డ్ లుక్ లో కనిపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube