స్పీడు పెంచిన ష‌ర్మిల‌.. స‌వాళ్లతో పాపులారిటీ కోసం ప్ర‌య‌త్నాలు..

తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌నకు అంతం చేసి, రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని చెబుతూ వైఎస్ ష‌ర్మిల‌ ఇక్క‌డ పార్టీ స్థాపించారు.ప్ర‌జ‌ల సంక్షేమమే ధ్యేయంగా, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డిచి ప్ర‌జ‌ల‌కు సుభిక్ష‌మైన పాల‌న అందిచాల‌నే ఉద్దేశ్యంతో తెలంగాణ‌లో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీని స్థాపించారు.

 Accelerated Sharmila Attempts For Popularity With Challenges . Sharmila, Ts Pol-TeluguStop.com

స‌మావేశాలు నిర్వ‌హిస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు.రాష్ట్రంలో అధికారమే ల‌క్ష్యంగా ఆమె కార్యాచ‌ర‌ణ రూపొందించి, దానికి అనుగూణంగా అడుగులు వేస్తున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు పాద‌యాత్ర ప్రారంభించారు.

తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని అధికారంలోకి తీసుకువ‌చ్చిన పాద‌యాత్ర ఇప్పుడు త‌మ పార్టీకి కూడా ల‌బ్ది చేకూరుస్తుంద‌నే సెంటిమెంట్‌తో దీనిని ప్రారంభించారు.400 రోజుల పాటు సాగే పాద‌యాత్ర‌కు ‘ప్రజా ప్రస్థానం’ అనే పేరు పెట్టారు.తండ్రి పాద‌యాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే 3 రోజుల కింద‌ట ఆమె పాద‌యాత్ర స్టార్ట్ చేశారు.

తిరిగి అక్క‌డనే యాత్ర‌ను ముగించ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆమె స‌వాల్ విసిరారు.తెలంగాణ‌లో ప్ర‌జ‌లు సంతోషంగా లేర‌ని, చాలా బాధ‌లు ప‌డుతున్నారని, స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మౌతున్నార‌ని ఆరోపించారు.

మిగిలు బ‌డ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేశార‌ని విమ‌ర్శించారు.

Telugu Sharmila, Cm Kcr, Tg, Ts, Ysrtp-Telugu Political News

సుభిక్షంగా ఉండే తెలంగాణ ఇప్పుడు, రైతు ఆత్మ‌హ‌త్య‌లు, నిరుద్యోగుల ఆక‌లి కేక‌లతో అల్లాడిపోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.తండ్రీ, కొడుకులు చెపుతున్న‌ట్టు ప్ర‌జ‌లెవ‌రూ సంతోషంగా లేర‌ని అన్నారు.తెలంగాణ‌లో స‌మ‌స్య‌లు లేక‌పోతే తాను ముక్కు నేల‌కు రాసి వెళ్లిపోతాన‌ని స‌వాల్ విసిరారు.దీనిని కేసీఆర్‌, కేటీఆర్ స్వీక‌రిస్తారా అని అన్నారు.మ‌రి దీనిపై ఎప్ప‌టి వ‌ర‌కు వారు స్పందించ‌లేదు.తెలంగాణ స‌మాజం కూడా ఈ స‌వాల్ ప‌ట్ల కేసీఆర్, కేటీఆర్ ఎలా స్పందిస్తారోన‌ని ఎదురుచూస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube