‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021’ ని మీ ముందుకు తీసుకొస్తుంది జీ తెలుగు

సంవత్సర మొత్తంలో జరుపుకునే అతి పెద్ద పండుగ వచ్చేసింది.అదే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.

 Zee Telugu Brings You ‘zee Telugu Family Awards 2021’ , Zee Telugu, Zee Telu-TeluguStop.com

తెలుగు లోగిళ్లలో ఆనందపు కాంతుల్ని వెదజల్లే ఛానల్ జీ తెలుగు.ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి అనుగుణంగా చూపిస్తుంది.

అన్నిటిని మించి ‘కష్ట మొచ్చినా కరగని, నష్ట మొచ్చినా చెరగని బంధాలతో నిండిన బంగారు కుటుంబం – జీ తెలుగు వారి కుటుంబం’.అలాంటి జీ తెలుగు “జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021” కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా ప్రసారం చేయనున్నారు.

మొదటి భాగం అక్టోబర్ 23, శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాగా, తదుపరి భాగం అక్టోబర్ 31 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

మునుపెన్నడూ చూడని రీతిలో జీ కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది జీ తెలుగు.

మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా, కృతి శెట్టి, శ్రేయా సారన్ దంపతులు, నిహారిక కొణిదెల, ఆలీ, ఆకాష్ పూరి, నిఖిల్, సీనియర్ నటీమణి సుధా, హెబ్బా పటేల్, సురభి మరియు ఇంకా ఎందరో అతిరథమహారధులు విచ్చేసి ఈ 11 వ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ని అంగరంగ వైభవంగా ముందుండి నడిపించారు.

శ్యామల, ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి, అఖిల్ సార్ధక్ తమ యాంకరింగ్ తో జీ కుటుంబం అవార్డ్స్‌ 2021కి మరింత అందం తీసుకువచ్చారు.

మన ఈ అవార్డ్స్ తో జీ తెలుగు కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరిపోయాడు అఖిల్.వీరి కామెడీ టైమింగ్‌తో అవార్డుల కార్యక్రమంలో నవ్వుల పువ్వులు విరిశాయి.

మొట్ట మొదటి సారి నటి శ్రేయ తన భర్త ఆన్డ్రీ కొస్చీవ్ తో కలిసి ఒక టెలివిజన్ అవార్డు ఈవెంట్ కి రావడం అందరిని అబ్బురపరిచింది.అలాగే, మన హనీ – అదే మెహ్రీన్ ఫిర్జాదా యాంకర్ అఖిల్ తో కలిసి ‘ఏమై పోతావే’ అనే పాట పాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇవన్ని ఒక ఎత్తైతే… మరోవైపు తమన్నా, ప్రదీప్, శ్రీముఖి, అఖిల్ తో కలిసి ఎఫ్ 3 థీమ్ స్కిట్ ని పెర్ఫర్మ్ చేసి అందరి కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు.

అంతేకాకుండా, అకుల్ బాలాజీ తన తల్లికి ‘పాద పూజ’ చేయగా, సుధా చంద్రన్ తన తండ్రి గురించి మాట్లాడుతారు.

జై ధనుష్ మరియు కీర్తి జై ధనుష్ పుట్టిన పసి పాపని తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు చేతుల మీదుగా ఊయలలో వేస్తారు.అబ్బా… అని అబ్బురపరించే ఎన్నో ఘటనలు, కొని మనసును హత్తుకునే క్షణాలు, మరికొన్ని కడుపుబ్బా నవ్వించే క్షణాలు.

ఈ అవార్డుల కార్యక్రమంలో సినీతారల డ్యాన్సులు, జీ కుటుంబ సభ్యుల అదిరిపోయే పర్ఫార్మెన్స్లు అందరిని ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటాయి.చెప్పడానికి ఎంతో ఉంది.కానీ అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా? అందుకే, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 ని మొదటి భాగం అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకు, రెండో భాగం ఆక్టోబర్ 31 సాయంత్రం 6 గంటలకు తప్పక వీక్షించండి మీ అభిమాన ఛానల్ జీ తెలుగు లో.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

Telugu Akash Puri, Akhil Sardhak, Nikhil, Shyamala, Srimukhi, Zee Telugu, Zeetel

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube