అఘోరా పాత్రల్లో నటించి మెప్పించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే?

ప్రస్తుత కాలంలో సినిమా హిట్ కావాలంటే కథ, కథనంతో పాటు హీరోల లుక్ కూడా కొత్తగా ఉండాల్సిందే.సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలు సైతం కొత్త తరహా పాత్రలపై దృష్టి పెడితే మంచిది.

 These Star Heroes Playing Aghora Role In Different Movies, Aghora Roles, Aghora-TeluguStop.com

బాలకృష్ణ అఖండ సినిమాలో అఘోరా రోల్ లో కనిపిస్తున్నారు.అఖండలో బాలయ్య ఈ గెటప్ లో కనిపించేది కొన్ని క్షణాలే అయినా ఆ సీన్లు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే విధంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

Telugu Aghora, Aham Brahmasmi, Chiranjeevi, Gaami, Nagavalli, Nene Devudni, Hero

అయితే బాలయ్య కంటే ముందే కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ఈ తరహా పాత్రలలో నటించి మెప్పించడం గమనార్హం.ఇమేజ్ ను పక్కన పెట్టి స్టార్ హీరోలు ఈ తరహా పాత్రలలో నటించడానికి రిస్క్ చేస్తున్నారు.టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సైతం ఒక సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.గామీ అనే సినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించనున్నారు.

Telugu Aghora, Aham Brahmasmi, Chiranjeevi, Gaami, Nagavalli, Nene Devudni, Hero

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు అఘోరా రోల్ లో కనిపించారు.శ్రీనివాసరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఢమరుకం సినిమాలో నాగార్జున కొన్ని నిమిషాల పాటు అఘోరా పాత్రలో కనిపించారు.అఘోర అనే మూవీలో నాగబాబు అఘోరగా కనిపించారు.అరుంధతి సినిమాలో సోనూసూద్ పశుపతి పాత్రలో అఘోరాగా నటించి మెప్పించారు.

Telugu Aghora, Aham Brahmasmi, Chiranjeevi, Gaami, Nagavalli, Nene Devudni, Hero

పి.వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన నాగవల్లి సినిమాలో వెంకటేష్ అఘోర పాత్రలో కనిపించారు.బాల డైరెక్షన్ లో తెరకెక్కిన నేను దేవుడ్ని సినిమాలో ఆర్య అఘోరగా కనిపించారు.అహం బ్రహ్మాస్మి సినిమాలో మంచు మనోజ్ సైతం అఘోరగా కనిపించనున్నారు.అఘోర పాత్రలో తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు తెరకెక్కనుండగా ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు సక్సెస్ ను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube