ఒకే పాటకు ఇద్దరు కొరియోగ్రాఫర్లు.. అయినా ఫలించని బాపినీడు కొత్త ప్రయోగం

కొన్ని సార్లు.కొన్ని సినిమాల మీద చేసే ప్రయోగాలు జనాల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

 Unbelievable Experiment In Chiranjeevi Movie By Director Bapineedu Details, Chir-TeluguStop.com

ఆ ప్రయత్నాలే సినిమాలను ఓ రేంజిలో విజయాన్ని అందుకునేలా చేస్తాయి కూడా.అలా సినిమాలపై రకరకాల ప్రయత్నాలు చేయడంలో దిట్ట దివంగత ప్రముఖ దర్శక నిర్మాత బాపినీడు.

ఆయన ఏ పని మొదలు పెట్టినా వెరైటీగానే ఉండేది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా పెట్టి ఆయన తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది.

అంతేకాదు.ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఓ రోజు నాలుగు ప్రాంతాల్లో నిర్వహించి వారెవ్వా అనిపించాడు.

గ్యాంగ్ లీడర్ విషయంలోనే కాదు.బిగ్ బాస్ సినిమా విషయంలోనూ తన మార్కు చూపించుకున్నాడు బాపినీడు.1995లో తెరకెక్కిక ఈ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో అనౌన్స్ చేశాడు.ఏకంగా రెండు ల‌క్ష‌ల మంది చిరంజీవి అభిమానుల స‌మ‌క్షంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాడు కూడా.

అంతేకాదు.గ్యాంగ్ లీడ‌ర్‌ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన బ‌ప్పీల‌హరి బిగ్ బాస్‌కు కూడా మ్యూజిగ్ అందించాడు.

అంతేకాదు.ఈ సినిమాలోనే పాట విషయంలో బాపినీడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

చాలా వైవిధ్యంతో ఈ పాటలను తెరకెక్కించాడు కూడా.ఈ సినిమాలోని రెండు పాటలను ఊటీలో చిత్రీకరించాడు.

Telugu Chiranjeevi, Chiranjeevibigg, Bapineedu, Musical, Choreographers, Tollywo

ఈ పాటల్లో ఒకదాని విషయంలో జనాలకు మరింత ఆసక్తి కలిగేలా చేశాడు.ఓ పాట సగ భాగాన్ని చిన్ని ప్రకాష్ చేత కొరియోగ్రఫీ చేయించాడు.మరో సగాన్ని సుందరంతో కొరియోగ్రఫీ ఇప్పించాడు.మొత్తంగా ఒక్క పాటను ఇద్దరు కొరియోగ్రఫర్లతో తెరకెక్కించాడు.

బాపినీడు బిగ్ బాస్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా.అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.

జనాలు కూడా పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు.అయితే ఈ సినిమాలోని అన్ని పాటలు అద్భుతంగా హిట్టయ్యాయి.

మ్యూజికల్ గా మాత్రం సినిమా మంచి హిట్ కొట్టినట్లే.అంతేకాదు.

ఆడియో రైట్స్ అమ్మకాల్లో కూడా మంచి రికార్డే నెలకొల్పింది బిగ్ బాస్ సినిమా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube