టీకా వేయించుకోకుంటే.. వేతనం లేని సెలవుల్లో పంపుతాం: ప్రభుత్వోద్యోగులకు న్యూయార్క్ మేయర్ హెచ్చరిక

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైరస్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నమైంది.

 Mayor De Blasio Announces Vaccine Mandate For New York City Workforce, Covid Vac-TeluguStop.com

లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.అపర కుబేరుల సంపద సైతం గంటల్లో ఆవిరైంది.

వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించేలోపు కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి మరింత బలం పుంజుకుని కొరడా ఝళిపిస్తోంది.రానున్న రోజుల్లో ఇది మరింత బలపడినా.

ప్రజలను రక్షించుకోవాలంటే వున్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సినేషన్.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.కొందరు ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేసుకుంటుంటే.కొన్నిచోట్ల మాత్రం ససేమిరా అంటుండటంతో ప్రభుత్వం సైతం కఠినంగానే వ్యవహరిస్తోంది.ఈ నిర్బంధ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొన్ని చోట్ల ఆందోళనలకు దారి తీసింది.

Telugu America, Corona Effect, Covid Program, Covid Vaccine, Employees, Mayor De

తాజాగా అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు.నగరంలోని పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు.ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిని వేతనం లేని సెలవులో పంపుతామని మేయర్ హెచ్చరించారు.ఆ నిర్ణయం దేశంలోని అతిపెద్ద పోలీస్ వ్యవస్థతో పాటు 1,00,000 మంది ఇతర ప్రభుత్వోద్యోగులను ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారిశుద్ధ్య హమాలీలు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు తదితర ప్రభుత్వోద్యోగులు తొలి టీకా తీసుకోవడానికి నవంబర్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు మేయర్ తన ఆదేశాల్లో తెలిపారు.అయితే రైకర్స్ ద్వీపంలోని జైలర్లు, సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో డిసెంబర్ 1 వరకు గడువు ఇచ్చారు.

మరోవైపు అమెరికా 5 నుంచి 11 ఏళ్ల మధ్యలోని పిల్లలకు టీకాలు వేయడానికి సిద్ధమవుతోంది.ఎఫ్‌డీఏ, సీడీసీలు ఆమోదించిన టీకాలను దేశంలోని 5-11 ఏళ్ల మధ్యలో వున్న 28 మిలియన్ల మంది పిల్లలకు కోవిడ్ 19 వ్యాక్సిన్‌లను అందించే ప్రణాళికను యూఎస్ బుధవారం రూపొందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube