'బచ్చన్' అనే పేరుకు అసలు అర్ధం చెప్పిన అమితా బచ్చన్?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి – 13 కార్యక్రమం ఎంతటి ప్రేక్షకాదరణ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే.తాజాగా జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమం ఎన్నో ప్రేమానురాగాలు, ప్రేమ పెళ్లి కుటుంబ విషయాల గురించి కొనసాగింది.

 Amitabh Bachchan Reveals The Story Behind His Surname On Kbc 13 To Hide Indicati-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మహారాష్ర్టలోని జల్‌గావ్‌కి చెందిన భాగ్యశ్రీ వచ్చారు.ఈమె ఈ కార్యక్రమానికి రాగానే ముందుగా అమితాబ్ తో తన వ్యక్తిగత విషయం గురించి చర్చించింది.

తాను ప్రేమ వివాహం చేసుకున్నానని అలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తన తండ్రి ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదు అనే విషయాన్ని తెలిపింది.తనకు రీసెంట్ గా పాప పుట్టిన కూడా తన తండ్రి తన పాపని చూడటానికి కూడా రాలేదంటూ భావోద్వేగం అయింది.

ఇది విన్న అమితాబచ్చన్ భాగ్యశ్రీ తండ్రికి అసలు విషయాన్ని తెలిపి క్షమించి తనతో మాట్లాడాలని ఈ సందర్భంగా తెలిపారు.అదేవిధంగా అమితాబచ్చన్ తన తండ్రి తల్లి ప్రేమ వివాహం గురించి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అమితాబ్ తల్లి తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌, తేజీ బచ్చన్‌ లది కూడా ప్రేమ వివాహమేనని తన తల్లి సిక్కు కుటుంబానికి చెందినవారు కాగా తన తండ్రి కాయస్థ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు.వారిద్దరు వివాహబంధంతో ఒకటవ తామంటే ఒప్పుకోని పెద్దలు తరువాత కొన్ని రోజులకు వివాహానికి ఆమోదం తెలిపారు.

అయితే తన పాఠశాలలో చదివే సమయంలో తన ఇంటి పేరు ఏంటి అని ప్రశ్నించగా అందుకు తన తండ్రి తన తల్లి లేదా తండ్రి కులానికి సంబంధించిన ఇంటి పేరు పెట్టకుండా తను కథలు రాసే కలం పేరు అనే పేరును తన ఇంటిపేరుగా పెట్టారనీ, బచ్చన్ అనే పేరుకు ఈ సందర్భంగా అమితాబ్ అసలైన అర్థాన్ని వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube