టెన్షన్ పెడుతున్న బాలయ్య అఖండ సినిమా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ.

 Balakrishna Boyapati Srinu Akhanda To Release For Christmas, Akhanda, Balakrishn-TeluguStop.com

ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే.

కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.అఖండ దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు అని ప్రకటించారు.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.అయితే ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరొకసారి సినిమా రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తయింది.ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాపై ఉన్న అంచనాలు తగ్గట్టుగానే అదిరే బిజినెస్ ను కూడా జరుపుకుంటోంది అని తెలుస్తోంది.అలాగే ఈ సినిమా నైజాం హక్కులు కూడా భారీగా దర పలికినట్లు తెలుస్తోంది.

ఈ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు వేగంగా 19 కోట్లు కొనుగోలు చేశారని సమాచారం.ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తోంది.అలాగే తమన్ సంగీతాన్ని అందించగా, ద్వారకా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube