నాగార్జున 'ఘోస్ట్‌'లో అఖిల్ గెస్ట్ రోల్.. భారీ ప్లాన్ తో వస్తున్నారుగా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో పోటీపడుతూ మరి సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు వెండితెరపై అలరిస్తూనే, మరొకవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

 Akhil Guest Role In Nagarjuna Ghost Nagarjuna, Tollywood, Ghost Movie, Akhil, Ag-TeluguStop.com

అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫ్రీలుక్ తో పాటుగా పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేసింది.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నారాయణ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో నాగార్జున సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున తనయుడు అఖిల్ ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని కూడా నటించబోతున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

Telugu Akhil, Ghost, Nagarjuna, Tollywood-Movie

అయితే ఒకవేళ ఇదే కనుక నిజం అయితే దర్శకుడు ప్రవీణ్ సత్తారు అక్కినేని అఖిల్ ను ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో చూపిస్తున్నాడో అన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో పెరుగుతోంది.ఇక తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అక్కినేని అఖిల్ సూపర్ హిట్ టాక్ నువ్వు అందుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సూపర్ హిట్ టాక్ తో ఎంజాయ్ చేస్తున్న అఖిల్ తొందర లోనే సురేందర్రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube