త్వరలో బెంగుళూరులో 3D డిజైన్లో కొత్త జిల్లా.. !!

దుబాయ్ లో 3D తరహాలో ఒక సిటీని నిర్మించిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా బెంగళూరు సిటీలో కూడా దుబాయ్ తరహాలోనే కొత్త 3D జిల్లాను డిజైన్ చేయబోతున్నారు.

 త్వరలో బెంగుళూరులో 3d డిజైన్లో-TeluguStop.com

కర్ణాటక ప్రభుత్వం రాబోయే రోజుల్లో ‘బెంగళూరు డిజైన్ డిస్ట్రిక్ట్‘ నిర్మించేందుకు ప్లాన్ చెయనున్నట్లు ఐటీశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ చెప్పారు.ఈ బెంగళూరు డిజైన్ జిల్లాను నిర్మించేందుకు 1,000 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టబోతున్నామని ఆయన చెప్పారు.4 రోజుల పాటు ఆయన దుబాయ్ ఎక్స్‌పోలో పర్యటించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.కర్నాటకలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశం అని అందుకని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నుంచి భారీ పెట్టుబడిదారులు అంగీకరిస్తున్నామని ఆయన ఈ సందర్బంగా చెప్పారు.

బెంగళూరు డిజైన్ జిల్లాను 100-150 ఎకరాలలోవిస్తరించే ఆలోచనలో ఉన్నామన్నారు.ప్రపంచ స్థాయిలో వ్యాపారాలకు అవసరమైన సిటీ కావడంతో ఇక్కడే అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.

డిజైన్, ఆర్ట్ ఫ్యాషన్ కలగలిసిన ప్రదేశంగా ఉంటుందని ఆయన చెప్పారు.ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో బెంగళూరు త్వరలో ప్రపంచ స్థాయి డిజైన్ జిల్లాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Design, Bengaluru, Dubai, Karnataka, Latest-Latest News - Telugu

అంతేకాకుండా నాణ్యత విషయంలో దుబాయ్ సిటీ కన్నా బెంగుళూరు ముందంజలో ఉంటుందని నారాయణ్ అన్నారు.మరికొన్ని రోజుల్లో బెంగళూరులో డిజైన్ ఫెస్టివల్ కూడా నిర్వహించే అవకాశం ఉందని నారాయణ్ చెప్పారు.అలాగే బెంగుళూరులో పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసేందుకు GCC ప్రతినిధి బృందం నవంబర్‌లో కర్నాకటకు రానున్నట్లు నారాయణ్ అన్నారు.ఎవోల్వెన్స్ గ్రూప్, క్రెసెంట్ గ్రూప్, డెక్కర్ & హలాబి, ఆస్టర్ డిఎమ్ హెల్త్‌కేర్, మైత్ర హాస్పిటల్ తో పాటుగా గల్ఫ్ ఇస్లామిక్ దేశాలు కూడా 3 ఏళ్ల కాలంలో ఇండియాలో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube